Rainy Season Safe Driving Tips: వాన‌కాలం ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి.. ఈ జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారా..?

Safety Driving Tips In Rainy Season: వ‌ర్షాకాలం ప్రారంభ‌మైంది. రెండు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక వాన‌కాలం వ‌చ్చిందంటే రోడ్డు ప్ర‌మాదాలు పెరుగుతాయి. సాధార‌ణ రోజులతో పోలిస్తే.. వాన‌లు కురిసే వేళ...

Rainy Season Safe Driving Tips: వాన‌కాలం ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి.. ఈ జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారా..?
Road Safty Tips
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 13, 2021 | 5:18 PM

Safety Driving Tips In Rainy Season: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వాన‌కాలం వ‌చ్చిందంటే రోడ్డు ప్ర‌మాదాలు పెరుగుతాయి. సాధార‌ణ రోజులతో పోలిస్తే.. వాన‌లు కురిసే వేళ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా రోడ్లు పాడ‌వ‌డం, నీటితో నిండి పోవ‌డం వ‌ల్ల కొన్ని యాక్సిడెంట్‌లు జ‌రిగితే.. వాహ‌నదారులు తగిన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌రికొన్ని ప్రమాదాలు జ‌రుగుతాయి. రోడ్లపై టైర్లు జారడం ద్వారా బ్రేక్ వేసినా ద్విచక్రవాహనాలు, కార్లు కొన్ని సందర్భాల్లో ఆగవు. వాన‌కాలంలో ప్ర‌యాణాల విష‌యంలో కొన్నిజాగ్ర‌త్తలు తీసుకుంటే ప్ర‌యాణాన్ని సాఫీగా సాగించేయొచ్చు. ఆ జాగ్ర‌త్త‌లు ఏంటంటే..

* అతివేగం ఎప్ప‌డూ మంచిది కాదు.. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షాకాలంలో వాహ‌నాల‌ను వేగంగా న‌డ‌ప‌కూడ‌దు. రోడ్ల‌న్నీ నీటితో ఉండ‌డం వ‌ల్ల తెరిచిన మ్యాన్ హోల్స్‌లో ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. అంతేకాకుండా రోడ్డు టైర్లు స్కిడ్ అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి. కాబ‌ట్టి వ‌ర్షాకాలంలో వాహ‌నాల‌ను మితిమీరిన వేగంతో న‌డ‌ప‌కుండా ఉండ‌డం ఉత్త‌మం.

* రోడ్డుపై వెళ్లేప్పుడు ముందున్న వాహ‌నాల‌కు మ‌ధ్య దూరాన్ని పాటించాలి. వ‌ర్షం కురుస్తుంద‌న్న ఆతృత‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో వేగంగా వెళ్ల‌కూడ‌దు. నీటి కార‌ణంగా కొన్ని సంద‌ర్బాల్లో బ్రేక్‌లు స‌రిగ్గా ప‌నిచేయ‌వు దీంతో ప్ర‌మాదాలు జరిగే అవ‌కాశాలుంటాయి. కాబ‌ట్టి ముందున్న వాహ‌నాల మ‌ధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.

* ఇక వాన కాలం వాహ‌నాల అద్దంపై ప‌డే నీటిని ఎప్పటిక‌ప్ప‌డు తొల‌గించ‌క‌పోతే రోడ్డు స‌రిగా కనిపించ‌క ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి వైప‌ర్ స‌రిగ్గా ప‌నిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.

* వ‌ర్షాకాలం త్వ‌రగా చీక‌టి ప‌డుతుంది కాబ‌ట్టి లైట్లు స‌రిగా ప‌నిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటివ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి వాహ‌న కండిష‌న్‌ను చెక్ చేయించుకోవాలి.

హైదరాబాద్ పోలీసులు కూడా వర్షం కురుస్తున్న సమయాల్లో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం కారణంగా వాహనాలు ప్రమాదానికి గురౌతున్న వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు.

Also Read: Santosh Sobhan : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్స్..

పెళ్లి బాజాల శబ్దాలతో చిర్రెత్తుకొచ్చిన గజరాజు ఏం చేసిందంటే …? యూపీలో పరుగో పరుగు !

Bhojeshwar Temple: అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం