Kaushik Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో ట్విస్ట్.. కౌశిక్‌రెడ్డికి మణిక్యం ఠాగూర్ లీగల్ నోటీస్
పాడి కౌశిక్ రెడ్డికి ఎఐసీసీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపించారు.
Manickam Tagore Legal Notices to Padi Kaushik Reddy: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కౌశిక్ రెడ్డికి ఎఐసీసీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపించారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డిపైనా, మనిక్కమ్ ఠాగూర్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ. 50 కోట్లు మణిక్యం ఠాగూర్‌కు ఇచ్చి రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపారు. వారం రోజుల్లో భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీస్‌లో పేర్కొన్న మణిక్యం ఠాగూర్. లేనిపక్షంలో ఒక కోటి రూపాయల పరువు నష్టపరిహారం తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై కౌశిక్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారన్నీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు కౌశిక్ రెడ్డి.
ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. క్రమశిక్షణ కలిగి కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను పార్టీ నాయకులందరూ తప్పనిసరిగా ఆమోదించాల్సిందేనన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయాలను నాయకులు, కార్యకర్తలు అమోదించాలన్నారు. తెలంగాణ ఇన్‌ఛార్జి మణిక్యం ఠాగూర్‌పై డబ్బులు అభియోగాన్ని భట్టి విక్రమార్క ఖండించారు. అభాండాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also… MLC Ramesh Yadav: ప్రాణాలు కావాలంటే ఊరు వదిలి వెళ్లిపో.. అధికార పార్టీ ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్!