Viral News: పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ చెప్పినవారికి భారీ రివార్డు.. ఎక్కడో తెలుసా.?
మనుషులు కనిపించకుండా పోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో తన పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది...
మనుషులు కనిపించకుండా పోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో తన పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పైగా పిల్లిని పట్టించినవారికి 30వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. ఈ కేసు నమోదైంది ఎక్కడో కాదండోయ్..మన హైదరాబాద్ నగరంలోనే.
హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా స్వతహాగా జంతు పేమికురాలు. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతున్నారు. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని అడాప్ట్ చేసుకున్నారు సెరీనా అప్పటి నుండి జింజర్ ను ప్రేమగా పెంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని పెట్ క్లినిక్ లో జూన్ 17 న సర్జరీ చేయించారు. స్టిచెస్ వేసిన చోట స్వేల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అయితే, అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్న సదరు పిల్లి జూన్ 24న హాస్పిటల్ నుండి తప్పిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో నిర్లక్ష్యంపై ఆగ్రహించిన సెరీనా పోలీసులను ఆశ్రయించింది.
పిల్లి తప్పిపోయిన విషయం పై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో , తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెంట్స్ పంచుతూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని వాపోయింది. పిల్లి ఆచూకీ తెలిపిన వారికి ముప్పై వేల రివార్డును ప్రకటించింది.
Also Read:
ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!
కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!