10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

క్రీడ ఏదైనా కూడా పాత రికార్డులను బద్దలకొట్టి కొత్త రికార్డులు నెలకొల్పడం ఆనవాయితీ. క్రికెట్‌లో అయితే ఇప్పటికే చాలామంది ప్లేయర్స్ ఎన్నో..

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!
Cricketer
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 12, 2021 | 6:09 PM

క్రీడ ఏదైనా కూడా పాత రికార్డులను బద్దలకొట్టి కొత్త రికార్డులు నెలకొల్పడం ఆనవాయితీ. క్రికెట్‌లో అయితే ఇప్పటికే చాలామంది ప్లేయర్స్ ఎన్నో పాత రికార్డులను తిరగరాశారు. అయితే కొన్ని గొప్ప రికార్డులను ఎవరూ బద్దలకొట్టలేరు. అలాంటిదే ఇది కూడా. ఇంగ్లాండ్ గడ్డపై ఓ బౌలర్ నెలకొల్పిన అరుదైన రికార్డు. సింగిల్ హ్యాండెడ్‌గా మొత్తం టీంను అవుట్ చేశాడు. ఈ ఘనత సరిగ్గా 89 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగింది. ఆ బౌలర్ పేరు హెడ్లీ వెరిటీ.

1932వ సంవత్సరం జూలై 9-12న యార్క్‌షైర్, నాట్టింగ్‌హంషైర్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హెడ్లీ వెరిటీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. ప్రత్యర్ధులను బెంబేలెత్తించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నాట్టింగ్‌హంషైర్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. లార్‌వుడ్ 48 పరుగులు చేయగా, లిల్లీ 46 పరుగులు చేశాడు. యార్క్‌షైర్ తరపున లేలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే పరిమితమైంది. నాట్టింగ్‌హంషైర్ బౌలర్ లార్వుడ్ ఐదు వికెట్లు తీశాడు.

హ్యాట్రిక్‌తో సహా పది వికెట్లు…

రెండో ఇన్నింగ్స్‌లో నాట్టింగ్‌హంషైర్‌ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు కీటన్, షిప్‌స్టన్ జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేశారు. అయితే అప్పుడే అనూహ్యంగా సీన్ రివర్స్ అయింది. నాట్టింగ్‌హంషైర్‌ జట్టును యార్క్‌షైర్ బౌలర్ బెంబేలెత్తించాడు. ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్‌ను పంపించాడు. 67 పరుగులకు మొత్తం టీంను ఆలౌట్ చేశాడు. 19.4 ఓవర్లలో వేసిన వెరిటీ మొత్తం 10 వికెట్లు తీయగా.. అందులో 16 మెయిడెన్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇదొక అద్భుతమైన రికార్డు. ఈ 10 వికెట్లు పడగొట్టడంలో వెరిటీ ఓ హ్యాట్రిక్‌ను కూడా సాధించాడు. దీనితో యార్క్‌షైర్ టార్గెట్ 139 కాగా.. ఆ జట్టు 40 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఆ లక్ష్యాన్ని చేధించింది.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!