AP Curfew: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!

కరోనాపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని..

AP Curfew: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!
Cm Ys Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2021 | 10:42 AM

కోవిడ్ నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఇక రాత్రి 9 గంటల తర్వాత రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కట్టుదిట్టమైన నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ వెల్లడించారు. మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా విధించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో.. సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారుల వరకు అందరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని అన్నారు. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలు వేయడంతో పాటు అవసరమైతే రెండు లేదా మూడు రోజులు దుకాణాల మూసివేతకు ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు ప్రజలెవ్వరూ కూడా గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించాలని సీఎం తెలిపారు. మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడినవారి ఫోటోలను ఎవరైనా కూడా పంపవచ్చునని.. దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!