Crime News: కన్న కొడుకు గొంతులో చేప పిల్ల వేసిన తండ్రి.. ఎందుకో తెలుసా..
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గొంతులో చేప ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఉండి మండలం చెరుకువాడలో కన్న కొడుకును చంపేశాడు తండ్రి. 9నెలల చిన్నారి గొంతులో చేపపిల్ల వేశాడో కన్నతండ్రి. గొంతులో చేప ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 9నెలల చిన్నారి గొంతులో తండ్రి నారాయణ చేప పిల్ల ఎందుకు వేశాడన్నది మిస్టరీగా మారింది. అయితే భార్యపై అనుమానంతోనే ఇలా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. భార్య ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేవాడని.. నిత్యం అనుమానిస్తూ టార్చర్ పెట్టేవాడంటున్నారు. ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతమై ఆ కోపాన్ని చిన్నారిపై తీర్చుకున్నాడని మండిపడుతున్నారు.
స్థానికులు ఆరోపణలు చేస్తున్నా.. నారాయణ మాత్రం తనకేం తెలియనట్టుగానే చూస్తూ ఉండిపోయాడు. బిడ్డను చంపిన పశ్చాత్తాపం ఏమాత్రం అతనిలో కనిపించలేదు. అభం శుభం తెలియని చిన్నారి ఉసురుతీసిన నారాయణను కఠినంగా శిక్షించాలని చెరుకువాడ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది జరిగింది…
భార్యపై అనుమానంతో కన్న కొడుకు నోట్లో చేప పిల్లను వేసి కిరాతకంగా చంపేశాడు తండ్రి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో ఈ దారుణం చెటు చేసుకుంది. తల్లి ఒడిలో ఆడుకుంటున్న తొమ్మిది నెలల బాలుడి గొంతులో గొరక చేపను వేశాడు. ఇది గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే బాలుడు చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. గొంతులో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు తేల్చారు. భార్య సుధారణిపై భర్త నారాయణకు అనుమానం కొడుకు మృతికి కారణంగా మారింది. కొడుకు తల్లిదండ్రు కంటే కొంచెం ఎరుపుగా పుట్టడంతో మరింతగా అనుమానాలకు దారి తీసింది.