Rajinikanth Confirms: పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మక్కళ్ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన..
తాను రాజకీయాల్లోకి రావట్లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశం అయ్యారు.
ఊరించి ఊరించి మళ్లీ ఉసూరుమనిపించారు. ఫ్యాన్స్‌తో భేటీకి ముందు పొలిటికల్ రీ ఎంట్రీపై ఆశలు రేకెత్తించారు. తర్వాత కొద్దిసేపటికే తుస్సుమనిపించారు. రజినీ మక్కల్ మండ్రంను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు రజినీకాంత్. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. అభిమాన సంఘాలతో చర్చించి ఈ నిర్ణయం వెల్లడించారు. రజిని మక్కల్ మండ్రంను కూడా తొలగిస్తూ డెసిషన్ తీసుకున్నారు. అయితే రజినీకాంత్ అభిమానుల సంఘం మాత్రం ఉంటుందని వెల్లడించారు.
కబాలీ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారా.. ఈసారి ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లో కొనసాగాలని డిసైడ్ అయ్యారా.. తమిళనాడులో అభిమాన సంఘాలతో రజినీకాంత్ సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి సూపర్‌స్టార్ రీఎంట్రీపై చర్చ మళ్లీ రచ్చ చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయాల్లోకి రానని ఏనాడు చెప్పలేదని రజినీ చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.
కోవిడ్ కారణంగా సమయం కాదని మాత్రమే ఆనాడు చెప్పానని అనడం చూస్తుంటే.. రజినీ మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. పాలిటిక్స్‌లోకి వస్తారా.. రారా అని చాలామంది అడుగుతున్నారని.. అందుకే అభిమానులతో సమావేశమయ్యానని స్పష్టం చేశారు రజినీ. ఫైనల్‌గా రీ ఏంట్రీపై అభిమానుల, సలహాలు రజినీ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కొద్దిసేపటి క్రితమే సంచలన ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజినీకాంత్. తాను రాజకీయాల్లోకి రానని ఎప్పుడూ చేప్పలేదని..కరోనాతో ఇప్పుడు కాదని మాత్రమే చెప్పానన్నారు. రజినీ ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. తమ బాస్ రీ ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంతలోనే తుస్సుమనిపించారు తలైవా. వారి ఆశలను అడియాశలు చేశారు.