Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koushik Reddy: కౌశిక్ రెడ్డి ఫోన్ వాయిస్ లీక్ వ్యవహారం : తీవ్రంగా పరిగణించిన టీ కాంగ్రెస్‌, 24 గంటల డెడ్ లైన్

హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ తనదేనంటూ కౌశిక్ రెడ్డి పేరుతో వైరల్ అవుతోన్న ఆడియో పరిణామాలు మొదలయ్యాయి. ఈ ఉదంతానికి సంబంధించి టీపీసీసీ..

Koushik Reddy: కౌశిక్ రెడ్డి ఫోన్ వాయిస్ లీక్ వ్యవహారం : తీవ్రంగా పరిగణించిన టీ కాంగ్రెస్‌, 24 గంటల డెడ్ లైన్
Koushik Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 11:30 AM

TPCC – Koushik Reddy – Huzurabad: హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ తనదేనంటూ కౌశిక్ రెడ్డి పేరుతో వైరల్ అవుతోన్న ఆడియో పరిణామాలు మొదలయ్యాయి. ఈ ఉదంతానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ కోదండరెడ్డి చర్యలకు దిగారు. హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు టీ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు ఉన్నాయి.

గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా అతని తీరు మారక పోవడంతో ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికితోడు కొత్త టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి.. ఈ ఘటన మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో 24 గంటల్లోగా వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి ఇచ్చిన నోటీస్ లో క్రమశిక్షణ సంఘం పేర్కొంది. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

నాకే.. హుజూరాబాద్‌ TRS టికెట్‌.. డబ్బూ, దస్కం అంతా నే చూసుకుంటా..! పాడి కౌశిక్‌రెడ్డి పేరుతో ఆడియో వైరల్‌

హుజూరాబాద్‌ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌. బైపోల్‌కి బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ దాదాపు కన్‌ఫామ్. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ అభ్యర్థులెవరో ఇంకా తేల్లేదు. కానీ.. ఈలోపే ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారి పాలిటికల్ కుదుపులకు కారణం అవుతోంది. ఈ ఆడియోలో ఉన్న విచిత్రం ఏంటంటే.. మాట్లాడింది కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి. కానీ ఆయన మాట్లాడుతోంది ఏంటో తెలుసా.. నాకు, టీఆర్‌ఎస్‌ టికెట్ కన్‌ఫాం అయ్యింది. ఇక గెలవాలంటే మీ హెల్ప్ కావాలి. డబ్బూ, దస్కం అంతా నేను చూసుకుంటా అన్నట్లు చాలా మ్యాటరే ఉంది అందులో.

టీఆర్‌ఎస్ టికెట్ కన్‌ఫాం అయ్యిందని. అంటే, కౌశిక్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అనేనా అర్థం. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే వ్యవహారం వైరల్ అవుతోంది. అయితే దాన్ని కౌశిక్‌ రెడ్డి పెద్దగా ఖండించలేదు. ఈ గ్యాప్‌లోనే ఈ ఆడియో వైరల్ అవ్వడం హుజూరాబాద్ పాలిటిక్స్‌లో కాస్త సంచలనం అనే చెప్పాలి.

ఆడియో అయితే కౌశిక్‌రెడ్డిది గానే తెలుస్తోంది. అయినా ఆయన వెర్షన్ కూడా తీసుకోవాల్సి ఉంది. అందుకోసం టీవీ9 ఓ గంట నుంచీ ప్రయత్నిస్తోంది గానీ ఆయన ఫోన్‌ లిఫ్ట్ చేసే సిచ్‌వేషన్‌లో ఉన్నట్లు లేదు. ఆయన నుంచి క్లారిటీరాగానే ఆ వెర్షన్‌ను కూడా మీ ముందు ఉంచుతాం. అయితే.. ఈ వ్యవహారాన్ని కాస్త లోతుగా చూస్తే.. గతంలో ఓ కామన్ ఫ్రెండ్‌ తండ్రికి సంబంధించిన దశదిశ ఖర్మకు కేటీఆర్‌ వచ్చారు. కౌశిక్‌ రెడ్డి కూడా వచ్చారు. ఈ ఇద్దరు కాసేపు అక్కడ ముచ్చటించిన సీన్ కూడా వైరల్ అయ్యింది. అయితే తన ఇంటిపక్కన ఉన్న ఫ్రెండ్ ఇంటికి కేటీఆర్ వస్తే మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కౌశిక్‌.

కేటీఆర్‌ను కలిసిన తర్వాత.. కారణం చెబుతూ కౌశిక్ ఇచ్చిన ఓ క్లారిటీ ఆరోజుకు వ్యవహారం ఫుల్ స్టాప్ పడింది. పైగా.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ సారథికాగానే మర్యాదపూర్వకంగా ఆయన్నీ కలిశారు కౌశిక్‌. సో… హుజూరాబాద్ టికెట్‌ ఆశిస్తున్నారు అన్నది అక్కడ ఆరోజుకి కనిపించిన సీన్. పైగా.. కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలిసి విష్ చెయ్యడం, టికెట్ ఆశించడం కూడా తప్పులేదు. కానీ ఈ గ్యాప్‌లో వచ్చిన వైరల్ ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్‌.

Read also: L Ramana: ఇవాళ తెలంగాణ భవన్‌కి ఎల్‌. రమణ, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం