L Ramana: ఇవాళ తెలంగాణ భవన్‌కి ఎల్. రమణ, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం
చివరికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు సైతం టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరబోతున్నారు. గురువారం సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ..
L Ramana – TRS – KTR: చివరికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు సైతం టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరబోతున్నారు. గురువారం సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ.. ఇవాళ తెలంగాణ భవన్‌కి వెళ్లి, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటారు. ఇప్పటికే గులాబీదళాధినేత, సీఎం కేసీఆర్ తో రమణ ఈనెల 8వ తేదీన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన రమణ.. కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించారు. ప్రగతి భవన్‌లో గురువారం రాత్రి రమణ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సీఎంతో సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ తో జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని ఆ సందర్భంగా రమణ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై తమ మధ్య చర్చ జరిగిందని రమణ వెల్లడించారు.
సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్ చెప్పారని, ఇందుకు తనతో కలిసి రావాలని కోరుతూ.. టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారన్నారు. ఇందుకు సానుకూలంగా నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు రమణ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రమణ అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానమన్నారు.
చేనేత కుటుంబ నుంచి వచ్చిన రమణ టీఆర్‌ఎస్‌కు అవసరమన్నారు. చేనేత వర్గాలకు ప్రభుత్వం ఎంతో చేసిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఈ క్రతువులో రమణ భాగస్వామి కావడం సంతోషకరమని చెప్పుకొచ్చారు. ఇక, ఇవాళ అధికారికంగా గులాబీ కండువా కప్పుకోబోతున్నారు రమణ.