AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకే హుజూరాబాద్‌ TRS టికెట్‌.. డబ్బూ, దస్కం అంతా నే చూసుకుంటా..! పాడి కౌశిక్‌రెడ్డి పేరుతో ఆడియో వైరల్‌

హుజూరాబాద్‌ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌. బైపోల్‌కి బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ దాదాపు కన్‌ఫామ్. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ అభ్యర్థులెవరో ఇంకా తేల్లేదు. కానీ.. ఈలోపే ఓ ఆడియో..

నాకే హుజూరాబాద్‌ TRS టికెట్‌.. డబ్బూ, దస్కం అంతా నే చూసుకుంటా..! పాడి కౌశిక్‌రెడ్డి పేరుతో ఆడియో వైరల్‌
Phone Audio
Venkata Narayana
|

Updated on: Jul 12, 2021 | 11:28 AM

Share

Huzurabad TRS ticket: హుజూరాబాద్‌ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌. బైపోల్‌కి బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ దాదాపు కన్‌ఫామ్. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ అభ్యర్థులెవరో ఇంకా తేల్లేదు. కానీ.. ఈలోపే ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారి పాలిటికల్ కుదుపులకు కారణం అవుతోంది. ఈ ఆడియోలో ఉన్న విచిత్రం ఏంటంటే.. మాట్లాడింది కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి. కానీ ఆయన మాట్లాడుతోంది ఏంటో తెలుసా.. నాకు, టీఆర్‌ఎస్‌ టికెట్ కన్‌ఫాం అయ్యింది. ఇక గెలవాలంటే మీ హెల్ప్ కావాలి. డబ్బూ, దస్కం అంతా నేను చూసుకుంటా అన్నట్లు చాలా మ్యాటరే ఉంది అందులో.

టీఆర్‌ఎస్ టికెట్ కన్‌ఫాం అయ్యిందని. అంటే, కౌశిక్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అనేనా అర్థం. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే వ్యవహారం వైరల్ అవుతోంది. అయితే దాన్ని కౌశిక్‌ రెడ్డి పెద్దగా ఖండించలేదు. ఈ గ్యాప్‌లోనే ఈ ఆడియో వైరల్ అవ్వడం హుజూరాబాద్ పాలిటిక్స్‌లో కాస్త సంచలనం అనే చెప్పాలి.

ఆడియో అయితే కౌశిక్‌రెడ్డిది గానే తెలుస్తోంది. అయినా ఆయన వెర్షన్ కూడా తీసుకోవాల్సి ఉంది. అందుకోసం టీవీ9 ఓ గంట నుంచీ ప్రయత్నిస్తోంది గానీ ఆయన ఫోన్‌ లిఫ్ట్ చేసే సిట్యుయేషన్ లో ఉన్నట్లు లేదు. ఆయన నుంచి క్లారిటీరాగానే ఆ వెర్షన్‌ను కూడా మీ ముందు ఉంచుతాం. అయితే, ఈ వ్యవహారాన్ని కాస్త లోతుగా చూస్తే.. గతంలో ఓ కామన్ ఫ్రెండ్‌ తండ్రికి సంబంధించిన దశదిశ ఖర్మకు కేటీఆర్‌ వచ్చారు. కౌశిక్‌ రెడ్డి కూడా వచ్చారు. ఈ ఇద్దరు కాసేపు అక్కడ ముచ్చటించిన సీన్ కూడా వైరల్ అయ్యింది. అయితే తన ఇంటిపక్కన ఉన్న ఫ్రెండ్ ఇంటికి కేటీఆర్ వస్తే మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కౌశిక్‌.

కేటీఆర్‌ను కలిసిన తర్వాత.. కారణం చెబుతూ కౌశిక్ ఇచ్చిన ఓ క్లారిటీ ఆరోజుకు వ్యవహారం ఫుల్ స్టాప్ పడింది. పైగా.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ సారథికాగానే మర్యాదపూర్వకంగా ఆయన్నీ కలిశారు కౌశిక్‌. సో… హుజూరాబాద్ టికెట్‌ ఆశిస్తున్నారు అన్నది అక్కడ ఆరోజుకి కనిపించిన సీన్. పైగా.. కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలిసి విష్ చెయ్యడం, టికెట్ ఆశించడం కూడా తప్పులేదు. కానీ ఈ గ్యాప్‌లో వచ్చిన వైరల్ ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్‌.

Read also: రైలు ఎక్కిస్తా.. ఊరికి తీసుకెళ్తా అంటే.. అమ్మ చేయి పట్టుకు వెళ్లారు. కానీ వారితో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడిందా తల్లి

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..