రైలు ఎక్కిస్తా.. ఊరికి తీసుకెళ్తా అంటే.. అమ్మ చేయి పట్టుకు వెళ్లారు. కానీ వారితో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడిందా తల్లి
అన్నెం, పున్నెం ఎరుగని చిన్నారులు. రైలు ఎక్కిస్తా.. ఊరికి తీసుకెళ్తా అంటే.. అమ్మ చేయి పట్టుకుని వెళ్లారు. కానీ వారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందా తల్లి...
Mother commits suicide with her two children: అన్నెం, పున్నెం ఎరుగని చిన్నారులు. రైలు ఎక్కిస్తా.. ఊరికి తీసుకెళ్తా అంటే.. అమ్మ చేయి పట్టుకుని వెళ్లారు. కానీ వారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందా తల్లి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిందీ ఘటన. బల్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి.. బలవన్మరణానికి పాల్పడింది గోదావరిఖనికి చెందిన అరుణ. తన ఇద్దరు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టింది.
కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణంగా చెప్తున్నారు. అమ్మ ఎక్కడికో తీసుకెళ్తోందని సంబరపడిన ఆ చిన్నారులకు.. తాము మృత్యువుతో పోరాడాల్సి వస్తుందని ఆ క్షణం తెలీలేదు. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడంతో అక్కడున్న సిబ్బంది, ప్రయాణికులు ఖిన్నులయ్యారు. వాళ్లు స్పాట్‌కు చేరుకునే సరికి పిల్లలిద్దరూ తీవ్ర గాయాలతో కనిపించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా పాప చనిపోయింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న అర్ధాంగి కోరికకి అతని నిండు ప్రాణం బలైపోయిందా.!
ఓ నిండు ప్రాణం పోయింది. భార్యభర్తల మధ్య సఖ్యత కొరవడం ఓ కారణమైతే. సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న తన అర్ధాంగి పిచ్చి కోరికలు అతడ్ని ప్రశాంతంగా బతకనివ్వలేదు. వీటికి తోడు ఉద్యోగం, కుటుంబ కలహాలు .. మొత్తం కలిసి వైవాహిక జీవితంపైనే విరక్తి పుట్టించాయి. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో నివాసముంటున్న పవన్‌కి.. మౌలాలికి చెందిన ప్రియాంకతో 2015లో వివాహం జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది నెలల నుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడం మొదలయ్యాయి. దీనికి తోడు పెళ్లై ఆరేళ్లైనా వీళ్లకు సంతానం కలగకపోవడంతో గొడవలు మరింత పెరిగాయి.
వీటితో పాటు మౌనిక తరచూ సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుండేది. ఎప్పటికైనా తానో స్టార్‌ని అవుతానంటూ చెప్పుకోవడం పవన్‌కి అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ విషయంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇక వైవాహిక జీవితం సంగతి ఇలా ఉంటే…ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న పవన్‌కి కరోనా కారణంగా ఆది కూడా లేకుండా పోయింది. దాంతో ఆర్ధికంగా కూడా ఎలాంటి ఆదాయం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. అంతే ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. పవన్ సూసైడ్ చేసుకోవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే పవన్ చనిపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పవన్ బలవన్మరణం చేసుకుంటే.. అతని తల్లిదండ్రులు కోడలు ప్రియాంకనే తమ బిడ్డ చావుకి కారణమని బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డికి ఫిర్యాదు చేసారు. ఇదే విషయంలో ప్రియాంక కూడా తన భర్త చావు విషయంలో అత్తమామలపై తనకు అనుమానం ఉందంటూ సనత్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా ఒకే చావుపై రెండు కంప్లైంట్‌లు రావడంతో పోలీసులు అసలు పవన్ మృతికి కారణాలు ఏంటని రాబట్టేపనిలో ఉన్నారు.