AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి బాజాల శబ్దాలతో చిర్రెత్తుకొచ్చిన గజరాజు ఏం చేసిందంటే …? యూపీలో పరుగో పరుగు !

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి ఘనంగా జరగబోతుండగా ..ఏనుగు కోపానికి అది కాస్తా అభాసు పాలైంది.

పెళ్లి బాజాల శబ్దాలతో చిర్రెత్తుకొచ్చిన గజరాజు ఏం చేసిందంటే ...?  యూపీలో పరుగో పరుగు !
Elephant Topples Cars
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 12, 2021 | 4:47 PM

Share

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి ఘనంగా జరగబోతుండగా ..ఏనుగు కోపానికి అది కాస్తా అభాసు పాలైంది. ఆనంద్ త్రిపాఠీ అనే పెళ్లి కొడుకు తన తల్లిదండ్రులు, బంధువర్గంతో తన నారాయణ్ పూర్ గ్రామం నుంచి అమలాపూర్ గ్రామానికి చేరుకున్నాడు. పైగా గ్రామంలో తన వెడ్డింగ్ కి ఓ గజరాజు కూడా తోడైతే ఇక అంతా తనను ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తారని అనుకున్నట్టు ఉన్నాడు. దాంతో తమ వెంట ఓ ఏనుగును కూడా తీసుకు వచ్చాడు. ఊరేగింపులో ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఉత్సాహంగా బారాత్ జరుపుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయితే పెళ్ళివారు మాంచి జోష్ తో టపాకాయలు (క్రాకర్స్) కాల్చడంతోను, పెళ్లి బాజాల శబ్దంతోను ఆ ఏనుగుకు చిర్రెత్తుకొచ్చింది.అమాంతం ఘీంకరిస్తూ పరుగులు తీసి పెళ్లి పాండాల్ ను నాశనం చేసింది. అక్కడ పార్క్ చేసి ఉన్న నాలుగు కార్లను కూడా ధ్వంసం చేసింది. ఇది చూసి పెళ్ళికొడుకు తో సహా అంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఒక్క వ్యక్తి కూడా అక్కడ ఉంటే ఒట్టు..చివరకు ఎవరో పోలీసులకు, అటవీ శాఖ వారికీ ఈ గజరాజ ‘ఘటన’ గురించి ఫోన్ చేశారు. వారు వచ్చేలోగా ఈ గజరాజు అక్కడే ఉన్న కొన్ని వస్తువులను కూడా తొండంతో విసిరి కొట్టింది.

చివరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వచ్చి అంతి కష్టం మీద ఆ ఏనుగును అదుపులోకి తేగలిగారు. సుమారు రెండు గంటల ‘హడావిడి’ తరువాత ఆ గజరాజు శాంతించింది. నా వెంట ఏనుగును ఎందుకు తీసుకు వెళ్లానా అని ఆనంద్ త్రిపాఠీ తెగ మధన పడుతున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: కేరళ, జమ్మూ కాశ్మీర్ ‘డోర్-టు డోర్-వ్యాక్సిన్ పాలసీ చూడండి’….కేంద్రానికి బాంబేహైకోర్టు ‘మొట్టికాయ’ !

Bhojeshwar Temple: అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం