New Alliance: పంజాబ్‌లో కొత్త పొత్తు.. బీజేపీకి షాకిచ్చిన శిరోమణి అకాలీదళ్.. మాయావతి రీఎంట్రీ?

పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. రెండు, మూడు దశాబ్ధాల పాటు బీజేపీతో కలిసి సాగించిన జర్నీకి కొన్ని నెలల క్రితం బ్రేకప్ చెప్పిన శిరోమణి అకాలీదళ్ పార్టీ.. తాజాగా బీఎస్పీతో జతకట్టింది. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీల...

New Alliance: పంజాబ్‌లో కొత్త పొత్తు.. బీజేపీకి షాకిచ్చిన శిరోమణి అకాలీదళ్.. మాయావతి రీఎంట్రీ?
Punjab
Follow us
Rajesh Sharma

|

Updated on: Jun 12, 2021 | 4:50 PM

New Alliance in Punjab State: పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. రెండు, మూడు దశాబ్ధాల పాటు బీజేపీతో కలిసి సాగించిన జర్నీకి కొన్ని నెలల క్రితం బ్రేకప్ చెప్పిన శిరోమణి అకాలీదళ్ పార్టీ.. తాజాగా బీఎస్పీతో జతకట్టింది. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. మరో 9 నెలల్లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ రెండు పార్టీలు 1996 లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారిగా కలిసి పోటీ చేశాయి.

2017 పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అకాలీదళ్ పార్టీలు ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్ళు కలిసే వున్న అకాలీదళ్, బీజేపీల మధ్య వ్యవసాయ చట్టాలు చిచ్చు రేపాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న శిరోమణి అకాలీదళ్ పార్టీ.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీఎస్పీతో జతకట్టింది శిరోమణి అకాలీదళ్.

తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ జూన్ 12న వెల్లడించారు. పొత్తులో భాగంగా దళితుల ఓట్లు అధికంగా వుండే దోబా రీజియన్‌లోని 8, మాల్వా ఏరియాలోని 7, మాఝా రీజియన్‌లోని 5 అసెంబ్లీ సీట్లు కలిపి మొత్తం 20 సీట్లలో బీఎస్పీ పోటీ చేస్తుందని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. పంజాబ్ వికాసమే యువత సరికొత్త మంత్రం అన్న నినాదంతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయని ఆయన తెలిపారు. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 111 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క చోటా విజయం సాధించలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టగా.. తొలిసారి పంజాబ్ అసెంబ్లీ బరిలో నిలిచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 20 సీట్లను గెలుచుకుంది.

ALSO READ: బెజవాడలో భారీ ‘రియల్’ మోసం.. లబోదిబో మంటున్న ఏజెంట్లు, బాధితులు

ALSO READ: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ