AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలని జీఎస్టీ కౌన్సిల్ కేంద్రాన్ని కోరింది. థర్డ్ వేవ్ పొంచి వున్న నేపథ్యంలో కరోనా చికిత్సకు వినియోగించే వైద్యపరికరాలపై పన్ను రేటు తగ్గించాలని...

GST Council: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్
Gst
Rajesh Sharma
|

Updated on: Jun 12, 2021 | 2:55 PM

Share

GST Council demands center to speed-up vaccination: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలని జీఎస్టీ కౌన్సిల్ కేంద్రాన్ని కోరింది. థర్డ్ వేవ్ పొంచి వున్న నేపథ్యంలో కరోనా చికిత్సకు వినియోగించే వైద్యపరికరాలపై పన్ను రేటు తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న పలు రాష్ట్రాల మంత్రులు కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. జూన్ 12వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 44వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. కోవిడ్-19 వ్యాక్సిన్, ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రద్దు లేదా పన్ను రేటు తగ్గించాలని పలు రాష్ట్రాలు జీఎస్టీ భేటీలో కేంద్రాన్ని కోరాయి. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ జీఎస్టీ భేటీకి హాజరయ్యారు.

కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని పలు రాష్ట్రాలు ఈ భేటీలో కోరాయి. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, అందుకోసం తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించాయి. కోవిడ్-19 చికిత్సకు‌ సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు. ఈ భేటీలో హరీశ్ రావు ప్రసంగించారు. దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి వారి ప్రాణాలు కాపాడాలని హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. అవసరాల‌ తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునైనా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు.

మూడో విడత‌ కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లుగానే ఎఫ్ఆర్ బీఎం పెంచాలని హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. కోవిడ్ ఉధృతి‌ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సాగుతోందని, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు‌కొనసాగుతుందో తెలియదన్నారు. మే నె‌లలో‌లాక్ డౌన్ వల్ల 4100‌ కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్.ఆర్.బీ.ఎం.ను 4 నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్.ఆర్.బీ.ఎం. పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు.