AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: గతనెలలో ప్రైవేటు ఆస్పత్రులకు అందిన వ్యాక్సిన్ కోటా ఎంత ? వాడిన డోసులు ఎన్ని …?

గత నెలలో దేశవ్యాప్తంగా 7.4 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా అందులో ప్రైవేటు హాస్పిటల్స్ కి 1.85 కోట్ల డోసుల వ్యాక్సిన్ కేటాయించారు.

Corona Vaccine: గతనెలలో ప్రైవేటు  ఆస్పత్రులకు అందిన వ్యాక్సిన్ కోటా ఎంత ?  వాడిన డోసులు ఎన్ని ...?
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 12, 2021 | 3:36 PM

Share

గత నెలలో దేశవ్యాప్తంగా 7.4 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా అందులో ప్రైవేటు హాస్పిటల్స్ కి 1.85 కోట్ల డోసుల వ్యాక్సిన్ కేటాయించారు. కానీ ఇందులోనూ అవి 1.29 కోట్ల డోసుల టీకామందులను మాత్రమే వినియోగించాయట.. అంటే మొత్తం మీద అవి 17 శాతం మాత్రమే. వినియోగించుకున్నాయని ఆరోగ్య శాఖ తనకు అందిన తాజా డేటా ప్రకారం తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే.. ప్రైవేటు హాస్పిటల్స్ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయని చెప్పి జనాలువీటి వైపు చూడడం మానేసిన కారణంగా ఇలా జరిగిందని ఈ శాఖ భావిస్తోంది.వీటికి 25 శాతం మాత్రం టీకామందులను కేటాయించారని, కానీ అవి 7.5 శాతం వ్యాక్సిన్ ని వాడాయని వార్తలు వచ్చాయని, కానీ లభ్యమైన డేటాను బట్టి చూస్తే.. ఈ లెక్కలకు పొంత కుదరడంలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత నెలలో ఈ ఆస్పత్రులకు ప్రభుత్వం గరిష్ట ధరలను నిర్ణయించింది. కోవిషీల్డ్ టీకామందును డోసు 780 రూపాయలు, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రూ. . 1145 కు, కోవాగ్జిన్ డోసు 1410 రూపాయలుగా ఉండాలని పేర్కొంది. పైగా ఇందులో 150 రూపాయలు సర్వీసు ఛార్జ్ కూడా ఉంటోంది. ప్రధాని మోదీ ప్రకటించిన కొత్త వ్యాక్సినేషన్ పాలసీ ప్రకారం.. ఈ నెల 21 నుంచి కేంద్రం ఆయా కంపెనీల నుంచి 75 శాతం వ్యాక్సిన్ ను ప్రొక్యూర్ చేస్తుంది. ఇందులో రాష్ట్రాలకు కేటాయించిన 25 శాతం కూడా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్ ఇంత శాతం వ్యాక్సిన్ ని వృధా చేసినట్టా అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీకామందులు వృధా చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఇటీవల హెచ్చరించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

Rashi In small Screen: బుల్లి తెరపై జ్ఞానాంబగా అడుగు పెట్టిన రాశి.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..