AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: ప్రేమించలేదని అమ్మాయి ఇంటి ముందు చేతబడి.. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో..

Crime News: ప్రేమ పేరుతో అమ్మాయిలకు బెదిరింపులు ఆగట్లేదు. యాసిడ్ పోస్తానని ఒకడు.. కత్తితో దాడి చేస్తానని మరొకరు.. ప్రాణాలు తీసేస్తానని వేరొకడు..

Black Magic: ప్రేమించలేదని అమ్మాయి ఇంటి ముందు చేతబడి.. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో..
Love Crime
Ravi Kiran
|

Updated on: Jul 12, 2021 | 11:49 PM

Share

ప్రేమ పేరుతో అమ్మాయిలకు బెదిరింపులు ఆగట్లేదు. యాసిడ్ పోస్తానని ఒకడు.. కత్తితో దాడి చేస్తానని మరొకరు.. ప్రాణాలు తీసేస్తానని వేరొకడు.. ఇలాంటి దారుణాలెన్నో. కానీ ఇక్కడొక ప్రబుద్దుడు ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో కొత్త రకంగా బెదిరింపులకు దిగాడు. అతడు చేసిన ఘనకార్యానికి పోలీసులు షాక్ అయ్యారు. అసలు అతడు చేసిన పని ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

రంగారెడ్డి నగర్‌లో నివాసముంటున్న మురళీకి 9 నెలల క్రితం రాంగ్ నెంబర్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ కాల్స్, మెసేజ్‌స్ చేసుకుంటున్నారు. కొన్నాళ్లకు ఆ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. దీనితో మురళీ ఆ విషయాన్ని ఆమెకు వ్యక్తం చేశాడు. అయితే సదరు యువతి మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించింది.

ఇదిలా ఉంటే కొద్దిరోజులకు ఆ అమ్మాయికి వివాహం అయ్యిందని మురళీకి తెలిసింది. దీనితో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని.. ఆమె భర్తతో సంతోషంగా ఉండకూడదని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే మురళీ తరచూ ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. కొద్దిరోజులకు ఆ బెదిరింపులు కాస్తా తారస్థాయికి చేరాయి. ఆమె అత్తగారి ఇంటి ముందు  క్షుద్రపూజలు నిర్వహించాడు.

అనుకున్నదే తడువుగా సదరు అమ్మాయి ఇంటి గేటు ముందు ఎముకలు, కుంకుమ, జీడిగింజలు, గవ్వలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, వక్కలు, తెల్ల , నల్లటి గుడ్డ ముక్కలు ,కుంకుమ మరియు పసుపు కల్పిన బియ్యం వంటి క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను ఉంచాడు. వాటిని చూసిన ఆమె కుటుంబీకులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామంలోని సీసీటీవీ కెమెరాలు, సెల్ టవర్ డేటా ఆధారంగా నిందితుడి మురళీని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!