AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తొలి విడత ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్.. కౌంటింగ్ డేట్స్ ఇవే..

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉండనుంది. గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో హడావుడి మొదలైంది.

Telangana: తొలి విడత ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్.. కౌంటింగ్ డేట్స్ ఇవే..
Mptc And Zptc Elections First Phase Notification Released
Krishna S
|

Updated on: Oct 09, 2025 | 11:41 AM

Share

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న నామినేషన్లకు చివరి తేదీ. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

ఈనెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాల్లో హడావుడి మొదలైంది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులకు జిల్లా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మిగితా స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 27న జరగనుంది. దీనికి సంబంధించి అక్టోబర్‌ 13న నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 16న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 19 వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 11న రెండు విడతలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఎన్నికల ఖర్చు లిమిట్ ఎంతంటే..

ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితిని కూడా ఖరారు చేసింది. జెడ్పీటీసీ అభ్యర్థి రూ. 4 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి వీలుంటుంది. ఇక సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2.50 లక్షలు ఖర్చు చేయొచ్చు. ఈ నిబంధనలు దాటితే అభ్యర్థులు మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారు లేదా గెలిచినా పదవిని కోల్పోతారు. అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సమర్పించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!