Telangana: కొత్తగూడెంలో సరికొత్త పొలిటికల్ ఫైట్‌.. ఎమ్మెల్యే వర్సెస్ హెల్త్‌ డైరెక్టర్‌..

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ మళ్లీ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే, ఈసారి చేసింది కాంట్రవర్సీ కామెంట్స్‌ కాదు, అంతకుమించి కాకరేపే పొలిటికల్‌ కామెంట్స్‌. అది కూడా అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు శ్రీనివాస్‌. మీ సేవలు ఇక చాలు.. రిటైర్మెంట్‌ తీసుకోండి అంటూ ఘాటు కామెంట్స్‌ చేశారు.

Telangana: కొత్తగూడెంలో సరికొత్త పొలిటికల్ ఫైట్‌.. ఎమ్మెల్యే వర్సెస్ హెల్త్‌ డైరెక్టర్‌..
Mla Vs Health Director
Follow us

|

Updated on: May 21, 2023 | 10:01 PM

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ మళ్లీ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే, ఈసారి చేసింది కాంట్రవర్సీ కామెంట్స్‌ కాదు, అంతకుమించి కాకరేపే పొలిటికల్‌ కామెంట్స్‌. అది కూడా అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు శ్రీనివాస్‌. మీ సేవలు ఇక చాలు.. రిటైర్మెంట్‌ తీసుకోండి అంటూ ఘాటు కామెంట్స్‌ చేశారు.

గడల శ్రీనివాస్‌, తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌, అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ఆయనే అధిపతి. కానీ, అతను చేసే పని కంటే.. ఆయన చేసే కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఫుల్‌ ఫేమస్‌. ఒకటా రెండా అనేక వివాదాలతో టాక్‌ ఆఫ్‌ది స్టేట్‌గా మారాడు ఎన్నోసార్లు.

క్షుద్రపూజలు చేసినా, దేవత అంటూ మహిళ కాళ్లు మొక్కినా, యేసుక్రీస్తు కృప వల్లే కరోనా కంట్రోల్‌ అయ్యిందన్నా, తాయిత్తు మహిమ వల్లే డాక్టర్‌ అయ్యాయని చెప్పినా, ఒక్కసారి కాదు వందసార్లు సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కుతానని చెప్పినా, నక్సలైట్‌ అవుదామనుకున్నా అని అన్నా, వ్యాక్సిన్‌ వేసుకుంటేనే రేషన్‌ ఇస్తామని కండీషన్‌ పెట్టినా, కేసీఆర్‌ బర్త్‌డేకి మొక్కలు నాటాలని సర్క్యులర్‌ జారీ చేసినా, యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ వల్లే కరోనా అంతమైందని చెప్పినా, ఆయనకే చెల్లింది. ఇలా ఒక్కటేమిటి.. ఆయన నోటి నుంచి వచ్చిన కాంట్రవర్సీ కామెంట్స్‌ ఎన్నో ఎన్నెన్నో..

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్‌ వేసిన ఈ ఫీట్ల వెనుక అసలు కథ పొలిటికల్‌ అజెండా అనేది మొదట్నుంచి వినిపించిన మాట. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఓపెన్‌అప్ అయిపోయారు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌. కాంట్రవర్సీ కామెంట్స్‌ వెనుక సీక్రెట్‌ ఏంటో రివీల్‌ చేసేశారు. కొత్తగూడెం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు విస్పష్టంగా చెప్పేశారు. దాంతో, కొత్తగూడెం కేంద్రంగా సరికొత్త పొలిటికల్‌ ఫైట్‌కి తెరలేచింది. అక్కడ రాజకీయాలు ఎమ్మెల్యే వర్సెస్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌గా మారిపోయాయ్‌. భద్రాద్రి కొత్తగూడెంలో ఒకే రోజు ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన వనమా అండ్‌ శ్రీనివాస్‌.. సండేనాడు పొలిటికల్‌ హీట్‌ పుట్టించారు.

కొత్తగూడెం రావడమే కాదు, ఎమ్మెల్యే వనమా టార్గెట్‌గా డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌. వనమా బెదిరిస్తే భయపడేవాళ్లెవరూ లేరంటూ ఘాటైన కామెంట్స్‌ చేశారు. వనమా ఆగడాలు ఇక సాగవు అంటూ ఏకంగా వార్నింగే ఇచ్చారు శ్రీనివాస్‌.

కొత్తగూడెం నుంచి మళ్లీ తానే పోటీ చేయబోతున్నట్టు ప్రకటించుకున్నారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. వనమా కామెంట్స్‌కి హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాస్‌ దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలి మీకు, ప్రతీసారి మీరేనా?, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వరా అంటూ ఒక రేంజ్‌లో చెలరేగిపోయారు శ్రీనివాస్‌.

హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కాంట్రవర్సీ కామెంట్స్‌ వెనుక రీజనేంటో ఇవాళ్టి వ్యాఖ్యలతో తేలిపోయింది. ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నట్టుగా పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు శ్రీనివాస్‌. అది కూడా కొత్తగూడెం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు విస్పష్టంగా చెప్పేశారు. దాంతో, కొత్తగూడెంలో వనమా వర్సెస్‌ శ్రీనివాస్‌గా మారింది రాజకీయం. మరి, ముందుముందు ఈ ఫైట్‌ ఎలా ఉండబోతోందో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..