Etela Rajender: అమిత్‌ షా ఊరికే ఢిల్లీకి పిలుస్తారా? టీవీ9 ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అధ్యక్ష పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? అసలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో ఏం చర్చించారు. ఇలాంటి ప్రశ్నలకు టీవీ9 వీకెండ్ అవర్‌ వేదికగా ఈటల రాజేందర్‌ చెప్పిన..

Etela Rajender: అమిత్‌ షా ఊరికే ఢిల్లీకి పిలుస్తారా? టీవీ9 ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు
Etela Rajender
Follow us

|

Updated on: May 21, 2023 | 8:58 PM

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అధ్యక్ష పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? అసలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో ఏం చర్చించారు. ఇలాంటి ప్రశ్నలకు టీవీ9 వీకెండ్ అవర్‌ వేదికగా ఈటల రాజేందర్‌ చెప్పిన సమాధానాలు ఏంటో ఓసారి చూద్దాం.

నాకు ఎలాంటి వర్గం ఉండదని, నేను ఒక్కడినే హస్తినకు వెళ్లాననని ఈటల చెప్పుకొచ్చారు. రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లాను. అధ్యక్ష మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదు. ఎవరికి తోచింది వాళ్లు చెప్పడం కరెక్ట్ కాదు. పైరవీలు, మార్కెటింగ్‌కు నేను వ్యతిరేకం కాదన్నారు. నేను శ్రమను, ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నా.. హైకమాండ్ ఆలోచన ఏంటో నాకు తెలియదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్నదానిపై నా అభిప్రాయాలు చెప్పాను. ఏ నాయకుడికి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది హైకమాండ్ మాత్రమే నిర్ణయిస్తుందని అన్నారు.

ఎవరిని ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్‌కు తెలుసు. లాబీయింగ్ చేసినంత మాత్రన నిర్ణయాలు తీసుకోరు. కర్నాటక ఫలితాలు వేరు.. తెలంగాణ రాజకీయం వేరు. కేసీఆర్ ఓడిపోవాలని పార్టీలే కాదు.. ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. మతాలు, కులాల సెంటిమెంట్‌పై ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేం. అన్ని వర్గాలు, మతాల ప్రేమను పొందే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు.. ప్రభుత్వంపై ఎలాంటి .. వ్యతిరేకత ఉందన్నదానిపై అమిత్‌షాతో చర్చించాం. అమిత్‌ షా ఊరికే ఢిల్లీకి పిలుస్తారా? అధ్యక్షపదవి లాంటి చిన్న అంశాలకు అమిత్‌షా పిలవరు. చాలా బ్రాడ్ ఇష్యూస్‌పై చర్చించేందుకే పిలిచారని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి