Hyderabad: వీధి కుక్కలకు హక్కులున్నాయ్.. కానీ, మనుషులకు లేవట.. శునకం చనిపోయిందని..

వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. వీధుల్లో నెత్తుటిఏరులు పారుతున్నాయి. ఏ మూల నుంచి ఏ కుక్క దాడిచేస్తుందో తెలియని భయానక పరిస్థితి. పసిబిడ్డల మరణాలకు సమాధానం ఎవరుచెపుతారని జనం ప్రశ్నిస్తోంటే...మనుషులు సరే కుక్కల ప్రాణాల సంగతేంటంటూ జంతుప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు...కుక్కలకీ హక్కులున్నాయంటూ కేసులు పెడుతున్న పరిస్థితి జీహెచ్‌ఎంసీలో కలకలం రేపుతోంది.

Hyderabad: వీధి కుక్కలకు హక్కులున్నాయ్.. కానీ, మనుషులకు లేవట.. శునకం చనిపోయిందని..
Stray Dogs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2023 | 9:16 PM

వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. వీధుల్లో నెత్తుటిఏరులు పారుతున్నాయి. ఏ మూల నుంచి ఏ కుక్క దాడిచేస్తుందో తెలియని భయానక పరిస్థితి. పసిబిడ్డల మరణాలకు సమాధానం ఎవరుచెపుతారని జనం ప్రశ్నిస్తోంటే…మనుషులు సరే కుక్కల ప్రాణాల సంగతేంటంటూ జంతుప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు…కుక్కలకీ హక్కులున్నాయంటూ కేసులు పెడుతున్న పరిస్థితి జీహెచ్‌ఎంసీలో కలకలం రేపుతోంది.

వీధిసింహాలు వెర్రెక్కిపోతున్నాయి. పసిబిడ్డలను పీక్కుతింటున్నాయి. అంబర్‌ పేట, కాజీపేట విషాదాలను మరచిపోక ముందే వరుస దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. మరిపెడ మండలం అనేపురం గ్రామంలో ఓ చిన్నారిపై భీభత్సంగా దాడి చేశాయి. చిన్నారికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకటీ రెండూ కాదు…ఇప్పటివరకు 15మందిపై డేంజర్‌ డాగ్స్‌ దాడి చేశాయి. అక్కడా ఇక్కడా అని కాదు ఎక్కడైనా ఇవే డేంజర్‌ డాగ్స్‌ దాడులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. అంతమాత్రాన కుక్కలను మాత్రం మీరేం అనకండి.. ఎందుకంటే కుక్కలకు బదులు మనుషులు బోనుల్లోకెళ్ళాల్సిన పరిస్థితులొచ్చాయి. పొరపాటున కుక్కలను ఏమైనా చేశామంటే జైలుకు పోవాల్సిందేనంటున్నారు జంతు ప్రేమికులు! ఎందుకంటే కుక్కలకు మాత్రమే హక్కులు ఉన్నాయట.. అదీ విషయం.

ఇదిలా ఉంటే…మరోవైపు హైదరాబాద్‌లో వీధికుక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. GHMC సిబ్బంది వీధికుక్కలను పట్టే సమయంలో ఓ కుక్క చనిపోయిందంటూ జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో కుక్కలు పట్టే ఉద్యోగిపై వాళ్లు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో కుక్కలకు హక్కులున్నాయి కానీ మనుషులకున్నాయా అన్నది ప్రశ్నార్థకమే. యస్‌. వీధి కుక్కలు మన మీద దాడి చేస్తే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కానీ జనాన్ని పీక్కుతింటోన్నవీధికుక్కపై మీరు దాడి చేస్తే మాత్రం జరిమానా, జైలు శిక్ష తప్పవు. మన చట్టాల్లో కూడా వీధికుక్కల నియంత్రణపై ఎటువంటి నియమాలూ లేవు. పశుక్రూరత నిరోధక చట్టం-1960 ప్రకారం మనుషులతో పాటు వీధికుక్కలకూ ఎక్కడైనా నివసించే హక్కుంది. వాటిని తరిమికొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. వీధికుక్కల మీద ఎవరైనా దాడులకు పాల్పడితే పాతిక వేలు జరిమానా, ఐదేళ్ల దాకా జైలు శిక్ష. దీన్నెలా చూడాలి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

వీధికుక్క చనిపోతే జంతు ప్రేమికులు కోర్టుకెక్కడం సరికాదంటున్నారు అడ్వొకేట్‌ మహ్మద్‌ బుర్హాన్‌. అంత ప్రేమ ఉన్నవాళ్లు వాటిని దత్తత తీసుకోవచ్చుగా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే, జనం అదే కోరుతున్నారు. కుక్కలు సరే.. మరి మనుషుల ప్రాణాల పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!