Hyderabad: డెలివరీ బాయ్‌పైకి దూసుకొచ్చిన పెంపుడు కుక్క.. పాపం, ప్రాణాలు కాపాడుకునేందుకు..

కుక్కలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కుక్కుల దాడులతో జనం బెంబేలిత్తిపోతున్నారు. తాజాగా, హైదరాబాద్‌ మణికొండ పంచవటి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌పైకి పెంపుడు కుక్క దూసుకురావడంతో .. భయంతో మూడో అంతస్తు నుంచి దూకాడు.

Hyderabad: డెలివరీ బాయ్‌పైకి దూసుకొచ్చిన పెంపుడు కుక్క.. పాపం, ప్రాణాలు కాపాడుకునేందుకు..
Hyderabad News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2023 | 7:14 PM

కుక్కలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కుక్కుల దాడులతో జనం బెంబేలిత్తిపోతున్నారు. తాజాగా, హైదరాబాద్‌ మణికొండ పంచవటి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌పైకి పెంపుడు కుక్క దూసుకురావడంతో .. భయంతో మూడో అంతస్తు నుంచి దూకాడు. దీంతో డెలివరీ బాయ్‌ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంచవటి కాలనీ లో సరుకులు డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ మూడో అంతస్తు ఎక్కగా.. ప్లాట్లో ఉన్న డాబర్మాన్ జాతికి చెందిన కుక్క కరిచేందుకు దూసుకువచ్చింది. దీంతో డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడని స్థానికులు తెలిపారు.

అమెజాన్ డెలివరీ బాయ్ ఒక పరుపు ఆర్డర్ తీసుకుని డెలివరీకి వచ్చాడని.. ఈ సమయంలో డోర్ తెరిచి ఉండటంతో ఒక్కసారిగా డాబర్ మెన్ డాగ్ దూసుకొచ్చిందని, దీంతో భయంతో మూడో ఫ్లోర్ నుంచి దూకినట్లు తెలిపారు.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలున్నాయి. అయితే, ప్లాట్లలో పెంపుడు కుక్కలు ఉన్న వారు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పదే పదే సూచిస్తున్నప్పటికీ.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. మహబూబాబాద్‌లో వీధికుక్కలు రెచ్చిపోయాయి. అనేపురంలో 15మందిపై కుక్కల దాడిచేశాయి. ఈ ఘటనల్లో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీధికుక్కలను చూస్తే జనం హడలిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..