Telangana: కానిస్టేబుల్‌ తుది పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ఆ డేట్ వరకు అభ్యంతరాలు చెప్పొచ్చు

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి నియామక మండలి వెబ్‌సైట్‌ ‌www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది.

Telangana: కానిస్టేబుల్‌ తుది పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల.. ఆ డేట్ వరకు అభ్యంతరాలు చెప్పొచ్చు
Telangana Police
Follow us
Aravind B

|

Updated on: May 22, 2023 | 6:01 AM

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి నియామక మండలి వెబ్‌సైట్‌ ‌www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాలతోపాటు ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి గత నెలలో తుది పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో డ్రైవర్లు, మెకానిక్‌ల వంటి కానిస్టేబుల్‌ సమానస్థాయి పోస్టులూ ఉన్నాయి.

విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ లో ప్రశ్నలకు సంబంధించి ఏమైన అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్లోనే తెలుపవచ్చు. అయితే ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ నెల 24 వరకూ ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..