AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GT Weather Update: బెంగళూరు-గుజరాత్ మ్యాచ్‌ అనుమానమే? వెదర్ రిపోర్ట్‌ చూస్తే ఫ్యాన్స్‌కు పరేషానే.. వీడియో

IPL 2023 70వ, చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులోని చిన్నస్మామి స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే మరోవార్త అభిమానుల్లో టెన్షన్ పెంచేసింది.

RCB vs GT Weather Update: బెంగళూరు-గుజరాత్ మ్యాచ్‌ అనుమానమే? వెదర్ రిపోర్ట్‌ చూస్తే ఫ్యాన్స్‌కు పరేషానే.. వీడియో
Rcb Vs Gt Weather
Venkata Chari
|

Updated on: May 21, 2023 | 6:00 PM

Share

RCB vs GT Weather Latest Update: IPL 2023 70వ, చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులోని చిన్నస్మామి స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే మరోవార్త అభిమానుల్లో టెన్షన్ పెంచేసింది. బెంగళూరులోని చిన్నస్వామిలో భారీ వర్షం కురిసిన వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం అక్కడ వడగళ్ళ వర్షంతోపాటు గాలి దుమారం కూడా ఉందంట. మైదానంలో పిచ్ పూర్తిగా కప్పబడి ఉన్న ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం..

బెంగళూరు, గుజరాత్ మధ్య జరిగే ఈ మ్యాచ్ బెంగళూరుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా RCB ప్లేఆఫ్స్‌లో నాలుగో జట్టుగా అవతరిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే బెంగళూరుకు పెద్ద సమస్యగా మారనుంది. అంతకుముందు ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి, ఆర్‌సీబీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం కష్టమే.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో వాతావరణం ఎలా ఉంది?

మరోవైపు, బెంగళూరు వాతావరణం గురించి మాట్లాడితే.. accuweather.com ప్రకారం బెంగళూరు నగరంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంది. ఈ వార్త రాసే వరకు, అక్కడ వర్షం ఆగిపోయింది. 6 గంటల వరకు వర్ష సూచన తగ్గుతుందని, అయితే మరోసారి 7 గంటలకు 65 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో 7 గంటల వరకు ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు ఉంటుందంట.

మరి ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ-గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేక వర్షం విలన్‌గా మారుతుందా అనేది చూడాలి. పాయింట్ల పట్టికలో, RCB 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ముంబై జట్టు 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. వాంఖడే స్టేడియంలో ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..