AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ‘సిట్టింగ్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించారు’.. కామారెడ్డి ప్రజలకు హ్యాట్సాఫ్‌ చెప్పిన కిషన్‌ రెడ్డి

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదన్న కేంద్ర మంత్రి, దీనిపై అందరం కలిసి సమీక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, రేవంత్‌ రెడ్డిలను ఓడించిన కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కిషన్‌ రెడ్డి

Telangana Elections: 'సిట్టింగ్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించారు'.. కామారెడ్డి ప్రజలకు హ్యాట్సాఫ్‌ చెప్పిన కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Basha Shek
| Edited By: Subhash Goud|

Updated on: Dec 03, 2023 | 9:37 PM

Share

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదన్న కేంద్ర మంత్రి, దీనిపై అందరం కలిసి సమీక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, రేవంత్‌ రెడ్డిలను ఓడించిన కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కిషన్‌ రెడ్డి. ‘కామారెడ్డి ప్రజలకు సెల్యూట్. వెంకట రమణారెడ్డి మీద విశ్వాసం ఉంచి గెలిపించారు. కామారెడ్డి అభివృద్ది కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. కీలకమైన ఎన్నికలు ఇవి. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను కాంగ్రెస్ ఎక్కువగా వినియోగించుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఫలితాలతో ఉత్సాహంగా పని చేస్తాం. మా పార్టీకి గతంలో 6.9 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 14 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిన ఒకే ఒక్క పార్టీ బీజేపీనే. ఒకటి నుంచి ఎనిమిది స్థానాలకు చేరాం. గెలిచిన ఎనిమిది మంది తెలంగాణ శాసన సభలో, బయట నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఈ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రాలేదు. ఫలితాలపై సమీక్ష చేస్తాం. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో , మధ్య ప్రదేశ్ లో కాషాయ జెండా ఎగిరింది. ఇవి సెమీ ఫైనల్ ఎన్నికలు. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదే లోక్ సభ ఎన్నికలలో గెలుస్తారని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే బీజేపీకి ప్రజలు ఓటేశారు. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు సాధిస్తాం సిట్టింగ్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రిని అభ్యర్థి నీ ఓడించిన రమణారెడ్డి.. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని కిషన్‌ రెడ్డి విషెస్‌ చెప్పారు.

కాగా మొత్తం 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి, నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ లో రాకేశ్ రెడ్డి, ముథోల్‌లో రామారావు పటేల్‌, నిజామాబాద్‌ అర్బన్‌లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్, గోషామహల్‌లో రాజా సింగ్, సిర్పూర్ లో పాల్వాయి హరీష్ గారు గెలుపొందారు.

ఇవి కూడా చదవండి

కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :