Adilabad Election Result 2023: జోగు రామన్న జోరుకు బ్రేక్.. అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం

Adilabad Assembly Election Result 2023 Live Counting Updates: మచ్చలేని నాయకుడిగా పేరున్నా.. అనుచరుల హంగామా కింది స్థాయి నేతల కబ్జాల ఆరోపణలు రామన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ఇక్కడి నుండి గెలుపు బావుటా ఎగరేయాలని కాషాయ సైన్యం కాచుకూచుంటే.. కాంగ్రెస్ వర్గ పోరుతో కొనసాగుతూనే సై అంటోంది. ఈసారి ఎన్నికలు ఆదిలాబాద్‌‌లో త్రిముఖ పోటీ తప్పేలా కనిపించడంలేదు.

Adilabad Election Result 2023: జోగు రామన్న జోరుకు బ్రేక్.. అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం
Srinivas Reddy Jogu Ramanna Payal Shankar
Follow us

|

Updated on: Dec 03, 2023 | 7:45 PM

Adilabad Assembly Election Result 2023 Live Counting Updates: ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ తరుఫున బరిలోకి దిగిన పాయల్ శంకర్ సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి జోగు రామన్న పై 6,147 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాయల్ శంకర్‌కు 66,468 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 60,321 ఓట్లు వచ్చాయి. దీంతో పాయల్ శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆదిలాబాద్.. ఆదివాసీల ఖిల్లా.. ప్రకృతి ఆనదాలకు సహజ వనరులకు కొదువ లేదు. పెనుగంగా పరవళ్ళు.. మాంగనీస్ గనుల సహజ సంపద.. నల్లబంగారు నేలలో పండే తెల్ల బంగారం.. ప్రముఖ పుణ్యక్షేత్రం జైనథ్.. ఇది ఆదిలాబాద్ నియోజకవర్గ స్వరూపం. దక్షిణ కశ్మీరంగా పిలవడంతో ఈ నియోజక వర్గంలో ఆత్మీయతలు.. వాడి వేడి రాజకీయాలు సరిసమానం. పత్తి సోయ ఇక్కడ ప్రధాన పంటలు. పట్టణ జనాభా సైతం అధికమే. ఈ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయాలతో జయకేతనం ఎగురవేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్నకు షాక్ తగిలింది. అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ చేతిలో పరాజయం పాలయ్యారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేత.. అయినా ఎక్కడో చిన్న అసమ్మతి. నియోజక వర్గ కేంద్రంలో అభివృద్ది జెట్ స్పీడ్ తో సాగుతున్నా.. పల్లెల్లో మాత్రం కనిపించని అభివృద్ధి. ఇప్పుడీ తేడానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఇబ్బందికరంగా మారింది. మచ్చలేని నాయకుడిగా పేరున్నా.. అనుచరుల హంగామా కింది స్థాయి నేతల కబ్జాల ఆరోపణలు రామన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.  వర్గ పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాసుపాలైంది. త్రిముఖ పోరుగా సాగిన ఆదిలాబాద్ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పాయల్ శంకర్ విజయం సాధించారు.

ఆదిలాబాద్ నియోజకవర్గం 1952 లో పురుడు పోసుకుంది. మూడు మండలాలు , ఒక మున్సిపాలిటీతో కలిపి ఉన్న నియోజకవర్గంలో 2,35,748 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,15,835 మంది ఉంటే, మహిళ ఓటర్లు 1,19,908 మంది ఉన్నారు. తెలంగాణ పోరాటంలో తనదైన శైలిలో పోరాటం చేసి జనం మనిషిగా ముద్ర పడ్డ జోగు రామన్న, ఇక్కడి నుండి వరుస విజయాలతో 2014లో మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా , బీసీ శాఖ మంత్రిగా 2018 వరకు కొనసాగిన రామన్న, ఆ తరువాత కేబినె‌ట్‌లో మాత్రం స్థానం సంపాదించుకోలేక పోయారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ నాలుగోసారి ప్రత్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డారు. జోగు రామన్న మొదటిసారి 2009లో తెలుగు దేశం పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఆయన, ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 టీడీపీ నుంచి పాయల్ శంకర్ మొదటసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగు రామన్న బీఆర్ఎస్ నుంచి, పాయల్ శంకర్ బీజేపీ నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. వరుసగా 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన రామన్నపై ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పాయల్ శంకర్ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనంలోకి వెళ్లి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుఫున కంది శ్రీ‌నివాస‌రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్

ఆ ప్రాంతంలో మళ్ళీ తెరమీదికి ప్రత్యేక జిల్లా డిమాండ్..
ఆ ప్రాంతంలో మళ్ళీ తెరమీదికి ప్రత్యేక జిల్లా డిమాండ్..
ఈ రంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై ఏపీ సర్కార్ దృష్టి
ఈ రంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై ఏపీ సర్కార్ దృష్టి
ఆ ఇద్దరి మధ్యలో మరో నేత.. టికెట్ విషయంలో నెలకొన్న ఆసక్తి..
ఆ ఇద్దరి మధ్యలో మరో నేత.. టికెట్ విషయంలో నెలకొన్న ఆసక్తి..
వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం..
వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం..
'మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు'.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
'మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు'.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!