Inspirational: ఆ ఇల్లే బడిగా మారింది..! తండ్రి స్పూర్తితో కుటుంబమంతా ఉపాధ్యాయులే…
ఈ ఇంట ఏ కార్యక్రమం జరిగినా మొత్తంలో ఇలా టీచర్లతో నిండిపోతుంది. బతకలేక బడి పంతులు అన్న నానుడిని పక్కనబెట్టి బతికే బడిపంతులు అన్న మాటను నిజం చేసింది ఈ కుటుంబం.
ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఎంతో గౌవరమైనది. నేటి బాలలే రేపటి ఆదర్శ పౌరులుగా తీర్చేదిద్దే గురుతర బాధ్యతను భుజాల మీద వేసుకొనే కీలక వ్యక్తులు. విద్యార్థులకు విద్యాబుద్దులు, జ్ణానం నేర్పి వారిని సన్మార్గంలో నడిపించే గురువులు. అలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కుటుంబంలో ఒక్కరు ఉంటేనే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కానీ జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఓ కుటుంబం మొత్తం ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుంది. ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన ఎన్. వెంకటస్వామి 1948లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట మానవపాడు, ఆ తర్వాత ఉండవల్లి, వల్లూరు, గట్టు ఉన్నత పాఠశాలల్లో సాంఘీకశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులు భోధించేవారు. 39ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి 1998లో ఉండవల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల్లో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు. ఇక వెంకటస్వామి, రాజేశ్వరి దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు సంతానం. తండ్రి వెంకటస్వామి స్పూర్తి, ప్రోత్సాహంతో పెద్ద కుమార్తె మినహా మిగిలిన నలుగురు ఉపాధ్యాయ వృత్తినే చేపట్టారు. అంతే కాదు వారి జీవిత భాగస్వాములను సైతం ఇదే రంగానికి చెందిన వారినే ఎంచుకోవడం విశేషం. ఇంకేముంటుంది కుటుంబం… కుటుంబమే టీచర్ల కుటుంబం.
వెంకటస్వామి కుమారుడు వేణుగోపాల్, ఎంఏ బీఈడీ చేసి ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్ గా మానవపాడు జెడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్నారు. ఇక ఆయన భార్య సంధ్యారాణి సైతం ఎంఏ బీఈడీ పూర్తి చేసి ఎంజేపీ పుల్లూరులో మ్యూజిక్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండవ కుమార్తె అనురాధ పెబ్బేర్ లోని కేజీబీవీలో సోషల్ టీచర్ గా పనిచేస్తుండగా ఆమె భర్త వెంకట ప్రసాద, పెబ్బేరు డిగ్రీ కాలేజ్ లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. మూడో కుమార్తె అరుణా దేవి అలంపూర్ హైస్కూల్ లో ఎస్ఏ గా పనిచేస్తున్నారు. ఇక నాలుగవ కుమార్తె పార్వతమ్మ రాజోళి జడ్పీహెచ్ఎస్ లో తెలుగు ను భోధిస్తున్నారు. ఆమె భర్త సుధాకర్ క్యాతూరు జెడ్పీహెచ్ఎస్ లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక పెద్ద కుమార్తె ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకోకపోయిన… ఆమె భర్త నాగరాజు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు.
ఇక ఈ ఇంట ఏ కార్యక్రమం జరిగినా మొత్తంలో ఇలా టీచర్లతో నిండిపోతుంది. బతకలేక బడి పంతులు అన్న నానుడిని పక్కనబెట్టి బతికే బడిపంతులు అన్న మాటను నిజం చేసింది ఈ కుటుంబం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..