AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..

భారత దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..
Subarnarekha River
Jyothi Gadda
|

Updated on: Dec 14, 2024 | 7:08 AM

Share

భారత దేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గోల్డెన్‌ రివర్‌.. స్వర్ణరేఖ నది.. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి.. జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరించుకుంటారు. స్వర్ణ రేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కి.మీ. దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు. ఈ నది రాళ్లల్లోంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారు రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!