AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్‌’గా విడాకుల మెహందీ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇప్పుడు హృదయ విదారకమైన విడాకుల కథలు చెప్పేందుకు కూడా మెహందీని వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విడాకుల మెహందీ డిజైన్‌ ద్వారా ఓ మహిళ తన వైవాహిక జీవితానికి సంబంధించిన కథను నెటిజన్లతో పంచుకుంది.. పెళ్లి మెహందీలా కాకుండా, విడాకుల మెహందీ డిజైన్‌లో తన భర్త చేసిన

'నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్‌'గా విడాకుల మెహందీ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Divorce Mehndi
Jyothi Gadda
|

Updated on: Dec 14, 2024 | 8:01 AM

Share

గొరింటాకు ఆడవాళ్లకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పుట్టిన రోజు, పండగలు, పెళ్లి ఇలా చెప్పుకుంటూ పోతే, శుభకార్యాలు ఏది వచ్చినా సరే తమ చేతులకు వయస్సుతో సంబంధం లేకుండా గొరింటాకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. పెళ్లిళ్ల సీజన్‌లో వధువు, ఇంట్లోని మహిళల చేతులకు మెహందీ వేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. యువతి చేతికి మెహందీ ఎంతగా పండితే అంత అందమైన జీవితం అనుభవిస్తారని, అంతలా ప్రేమించే జీవిత భాగస్వామి దొరుకుతాడని చెబుతారు. కానీ, ఇప్పుడు విడాకుల మెహందీ డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాంప్రదాయకంగా వధూవరుల మధ్య ప్రేమ, ఐక్యత, ఆనందానికి చిహ్నంగా ఇప్పటి వరకు మెహెందీ డిజైన్లు చూశారు.. ఇప్పుడు హృదయ విదారకమైన విడాకుల కథలు చెప్పేందుకు కూడా మెహందీని వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విడాకుల మెహందీ డిజైన్‌ ద్వారా ఓ మహిళ తన వైవాహిక జీవితానికి సంబంధించిన కథను నెటిజన్లతో పంచుకుంది.. పెళ్లి మెహందీలా కాకుండా, విడాకుల మెహందీ డిజైన్‌లో తన భర్త చేసిన ద్రోహం, తను అనుభవించిన భాదను వర్ణించింది. కాగా, ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఊర్వశి వోరా శర్మ అనే వినియోగదారు సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. దీనిలో ఒక మహిళ తన చిన్నాభిన్నమైన వైవాహిక జీవితం గురించి తన చేతుల్లో ఎర్రగా పండిన మెహందీ డిజైన్ ద్వారా చెబుతోంది. చివరకు విడాకులు తీసుకున్నాను అనే పదాలతో అలంకరించబడిన ఆమె మెహందీ తనలోని భావోద్వేగాన్ని వివరిస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి..

తలాక్ మెహందీ డిజైన్‌లో సతన భర్త నుండి తనకు ఎలాంటి మద్దతు లేదని చెప్పింది. ఈ డిజైన్‌లో మొదట వివాహం, తరువాత గొడవలు, జీవిత భాగస్వామి నుండి మద్దతు లేకపోవడం, తను అనుభివించిన మరనోవేదన, చివరకు విడాకులు వర్ణించారు. సోషల్ మీడియాలో యూజర్లు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..