Teacher Dance in Classroom : క్లాస్ రూమ్ లో యంగ్ టీచర్ డ్యాన్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
ఈ వీడియోపై నెటిజన్లు సదరు టీచర్‌కు గట్టిగానే క్లాస్ పీకారు. ఇంతకు ముందు కొంత మంది అమ్మాయిలు చేసే ఇలాంటి డ్యాన్స్ చూడాలంటే డబ్బులు ఖర్చుపెట్టి డ్యాన్స్ బార్‌లు, పబ్బులు, క్లబ్బులకు వెళ్లేవారు. ఈరోజుల్లో
డ్యాన్స్ ప్రియులు తరచుగా తమ ట్యాలెంట్‌ను బయటపెడుతుంటారు. ఇందుకోసం కొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వేదికగా ఎంచుకుంటారు. రీల్ పేరుతో తమ నృత్య ప్రదర్శనను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆరాట పడుతుంటారు. ఈ క్రమంలో తామున్న ప్రదేశం, తమకున్న పరువును కూడా మర్చిపోతారు. అలాంటి పనే చేసింది ఇక్కడో స్కూల్ టీచర్. రీల్స్ మోజులో పిల్లల ఆరాధ్యదైవమైన ఉపాధ్యాయురాలు క్లాస్ రూమ్‌లో ఇలా రెచ్చిపోయింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో తరగతి గది దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ తెల్లటి దుస్తులు ధరించిన కొందరు విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. మెరూన్ కలర్ చీర ధరించి ఉన్న ఓ ఉపాధ్యాయురాలు బ్లాక్ బోర్డు ముందు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో విద్యార్థులను ఆకట్టుకుంది. భోజ్‌పురి పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, మేడమ్ గ్రేడ్ నటిలా నడుము ఊపుతూ డ్యాన్స్ చేస్తున్నారు. పాటలో రిథమ్ పెరిగే కొద్దీ మేడం కూడా రెచ్చిపోతున్నారు. క్లాస్ రూమ్‌లో ఉన్న అమ్మాయిలు మేడమ్ చేసిన ఈ డ్యాన్స్ చూసి చలించిపోయారు. కానీ ఇప్పుడు ఆమె టీచర్ కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోపై నెటిజన్లు సదరు టీచర్‌కు గట్టిగానే క్లాస్ పీకారు. ఇంతకు ముందు కొంత మంది అమ్మాయిలు చేసే ఇలాంటి డ్యాన్స్ చూడాలంటే డబ్బులు ఖర్చుపెట్టి డ్యాన్స్ బార్‌లు, పబ్బులు, క్లబ్బులకు వెళ్లేవారు. ఈరోజుల్లో స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయాలలో టీచర్ల పర్యవేక్షణలో పెద్దింటి ఇంటి ఆడపిల్లలు, మంచి కాలేజీల్లో చదివే అమ్మాయిల దగ్గర కూడా అదే అశ్లీలతను ఉచితంగా చూపిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..