చలికాలంలో గుప్పెడు ఈ గింజలు తింటే చాలు..మీ గుండె పదిలం..! మరెన్నో లాభాలు..

శీతాకాలం అంటేనే జలుబు, దగ్గుతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో పాటు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణం శరీరంలో ఇమ్యూనిటీ లోపించడమే. అందుకే చలికాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటుంటారు ఆరోగ్య నిపుణులు. ఈ సీజన్‌లో బెస్ట్ ఫుడ్ అంటే పిస్తా అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. చలకాలంలో క్రమం తప్పకుండా పిస్తా తినడం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. అవేంటో చూద్దాం రండి..!

Jyothi Gadda

|

Updated on: Dec 10, 2024 | 10:30 AM

పిస్తాలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా పప్పు తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
పిస్తాపప్పులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ తినడం వల్ల మీ ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. పిస్తాపప్పులో బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

2 / 5
పీచు, నీరు పుష్కలంగా ఉండే పిస్తా పప్పు తినడం వల్ల పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. దీని కారణంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యవంతమైన వయోజన వ్యక్తి రోజూ కనీసం 4 నుంచి 4 పిస్తాపప్పులు తినడం మంచిది. వీటి కంటే ఎక్కువగా తినకూడదు. ఇందులో హెల్తీ కొలాజెన్ ఉంటుంది. తగిన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మేలు చేస్తుంది.

3 / 5
పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ రోగులకు ఇది అద్భుతమైన డైట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించేవారికి పిస్తా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

4 / 5
పిస్తా తినడం వల్ల రక్త నాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్‌ని నిర్మూలిస్తుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంచుతుంది. గుండె వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా పిస్తాలో జెక్సైంథిన్, ల్యూటిన్ అనే పోషకాల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మొబైల్, ల్యాప్‌టాప్ ద్వారా కలిగే బ్లూ లైట్ నుంచి కాపాడుతుంది.

5 / 5
Follow us