- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress She Is Telugu Heroine Eesha Rebba Childhood Photo Goes Viral
Tollywood: నిషా కళ్లతో మాయ చేసే తెలుగమ్మాయి.. ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే అంతే ఇక..
సినీరంగంలో తెలుగమ్మాయిలు హీరోయిన్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు. అవకాశాలు వచ్చినప్పటికీ కథానాయికగా సక్సెస్ కానీ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ తెలుగమ్మాయి మాత్రం ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు.
Updated on: Dec 10, 2024 | 11:32 AM

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు. తనే అచ్చతెలుగమ్మాయి ఈషా రెబ్బా.1990 ఏప్రిల్ 19న వరంగల్ లో జన్మించింది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాదాపు పదేళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది.

నటి కాకముందు మోడల్ గా పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. ముందుగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అంతకు ముందు ఆ తర్వాత, అ, అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం, బందిపోటు వంటి చిత్రాల్లో నటించింది.

ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ వరుస ఆఫర్స్ వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

పిట్టకథలు, త్రీ రోజెస్ వంటి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోనూ సత్తా చాటింది. స్టార్ హీరోస్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. తమిళం, మలయాళంలో కథానాయికగా వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈషా రెబ్బా. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.




