గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది పుష్ప 2. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అల్లు అర్జున్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.