ఇండిగో విమానంలో చోరీ..! ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న మహిళ ఫిర్యాదు..

ఇండిగో పేరు ఇటీవలే చెత్త ఎయిర్‌లైన్స్ జాబితాలో చేర్చబడింది. అయితే, దీనిని ఇండిగో తిరస్కరించింది. కానీ, ఇండిగోపై పెరుగుతున్న ఫిర్యాదులు, ప్రయాణీకుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో ఫిర్యాదు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇండిగో విమానంలో చోరీ..! ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న మహిళ ఫిర్యాదు..
Indigo Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2024 | 1:40 PM

2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు సంబంధించి ఇటీవల ఓ సర్వే విడుదలైంది. ఆ సర్వే ప్రకారం ఇండిగో విమానాయ సంస్థకు అత్యంత బ్యాడ్‌ రేటింగ్‌ వచ్చింది. ఎయిర్‌లైన్స్‌లో నిర్వహణ లోపం కారణంగా ఇండిగోకు ఈ స్థానం దక్కింది. దీనిపై కంపెనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్వే విశ్వసనీయతకు సంబంధించి కూడా విమానయాన సంస్థ ప్రశ్నలను లేవనెత్తింది. కానీ, తాజాగా ఇండిగోపై మరో ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.

షీజ్ వ్యవస్థాపకురాలు త్రిష శెట్టి ఇండిగోపై ఫిర్యాదు చేశారు. విమానంలో తన తల్లి బ్యాగ్‌ని ఎవరో ప్రయాణికులు దొంగిలించడానికి ప్రయత్నించారని, అయితే ఈ విషయంలో ఫిర్యాదు నమోదు చేయడానికి ఇండిగో నిరాకరించిందని తన X ఖాతాలో పేర్కొన్నారు. ఇండిగో విమానంలో తన తల్లితో తన అనుభవాన్ని డిసెంబర్ 6న త్రిషా శెట్టి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇండిగో ఫ్లైట్ 6E 17లో ప్రయాణిస్తున్నప్పుడు తన తల్లి నిద్రపోయిందని, ఈ సమయంలో మరో ప్రయాణికుడు తన హ్యాండ్‌బ్యాగ్‌ని దొంగిలించడానికి ప్రయత్నించాడని త్రిష రాశారు. అదృష్టవశాత్తూ అతని తల్లి నిద్రలేచి సంఘటనను చూసింది. దొంగ వెంటనే బ్యాగ్ వెనక్కి వేశాడు. ఇండిగో సిబ్బంది తమ ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించారని, సాకులు చెప్పి తన తల్లిని తప్పించారని ఆరోపించారు. మరో పోస్ట్‌లో, ఇతర ప్రయాణీకుల మద్దతు వల్ల మాత్రమే బ్యాగ్ రికవరీ అయిందని, పరిస్థితిని ఎయిర్‌లైన్ నిర్వహించే విధానం చాలా పేలవంగా ఉందని రాశారు. ప్రజలు ఇలా దోపిడికి బలి కావడం చాలా బాధ కలిగిస్తోందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..