AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోన్‌ ఇస్తానని నమ్మించి రూ.39 వేల నాటు కోళ్లు తినేసిన SBI బ్యాంకు మేనేజర్.. ఎక్కడంటే?

రైతుకు లోన్ ఇస్తానని నమ్మించి ఓ SBI బ్యాంకు మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా రూ.39 వేల విలవ చేసే నాటుకోళ్లను కసపిస లాగించేశాడు. కాళ్లు వరుసగా తింటున్నాడు కానీ తనకు లోను మాత్రం ఇవ్వడంలేదని భావించిన రైతు ఓ రోజు మేనేజర్ ని నిలదీశాడు. దీంతో అతడు ముఖం చాటేశాడు. మోసపోయానని భావించిన రైతు చివరకు పోలీసులను ఆశ్రయించాడు..

లోన్‌ ఇస్తానని నమ్మించి రూ.39 వేల నాటు కోళ్లు తినేసిన SBI బ్యాంకు మేనేజర్.. ఎక్కడంటే?
SBI bank manager desi chicken scam
Srilakshmi C
|

Updated on: Dec 10, 2024 | 7:08 PM

Share

ఛత్తీస్‌గఢ్‌, డిసెంబర్‌ 10: ఓ బ్యాంక్‌ మేనేజర్‌కు నాటు కోడి కూర అంటే మహా ఇష్టం. పుష్టిగా నాటు కోడి కూర తినాలని కలలు కన్నాడు. కానీ చేస్తున్న ఉద్యోగం రిత్యా అలాంటి అవకాశం దొరకలేదు. ఈ క్రమంలో అతడికి ఓ జాక్‌పాట్ లాంటి ఐడియా తట్టింది. ఇంకేం రోజూ నాటు కోడి కూర తినేద్దామని ప్లాన్‌ వేశాడు. లోన్‌ ఇస్తానని నమ్మించి ఏకంగా రూ.39 వేల విలువ చేసే నాటు కోళ్లు తినేశాడు. ఆకలితో ఉన్న బకాసురుడి మాదిరి కోళ్లను నమిలేసిన ఆ బ్యాంకు మేనేజర్‌ని తీరా లోన్‌ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మస్తూరి పట్టణానికి చెందిన రైతు రూపచంద్ మన్హర్‌కు కోళ్ల ఫారమ్‌ ఉంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ను కలిసి, రూ.12 లక్షల లోన్‌ అడిగాడు. లోన్‌ ఇస్తానని చెప్పిన మేనేజర్‌ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తదన్న ఆశతో మన్హర్ బ్యాంకు మేనేజర్‌కి రోజూ నాటు కోడి మాంసం తెచ్చివ్వసాగాడు. అలా మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్‌ తినేశాడు. పైగా లోన్‌ కోసం 10 శాతం కమిషన్‌ కూడా చెల్లించాడు. లోన్‌ కావాలంటే ప్రతి శనివారం నాటు కోడి మాంసం కావాలని అడగటం, మరో చోట కోడిని కొని తీసుకురావడం రైతుకు దినచర్యగా మారిపోయింది.

అయినా బ్యాంకు మేనేజర్‌ లోన్‌ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో బ్యాంకు మేనేజర్‌ తనకు లోన్‌ ఇవ్వదల్చుకోలేదని భావించి, తనను మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్‌కు ఇచ్చిన కోళ్ల తాలూకు బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.