ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడి బ్లాక్‌ మెయిల్.. కట్ చేస్తే ప్రేయసి స్కెచ్‌కు బలి! ఏం చేసిందంటే

ప్రేయసి అర్ధరాత్రి ఫోన్ చేసి ప్రియుడిని ఓ స్పాట్ కి పిలిచింది. అక్కడ ఓ చెట్టు కింద కూర్చుని అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పింది. అంతే వెనకా ముందు ఆలోచించకుండా ప్రియుడు క్షణాల వ్యవధిలో అక్కడ వాలిపోయాడు. మాటల్లో పెట్టిన ప్రేయసి అతనికే తెలియకుండా పక్కనే ఉన్న చెట్టుకు తెలివిగా కట్టేసింది.. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు ప్రేయసి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..

ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడి బ్లాక్‌ మెయిల్.. కట్ చేస్తే ప్రేయసి స్కెచ్‌కు బలి! ఏం చేసిందంటే
West Bengal Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2024 | 8:18 PM

హౌరా, డిసెంబర్‌ 9: ప్రియుడు బ్లాక్‌ మెయిల్ చేశాడని ఓ యువతి ఆగ్రహంతో విశ్వరూపం దాల్చింది. అంతే ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ కట్ చేసి బుద్ధి చెప్పింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని దోమ్‌జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్బతిపూర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

పార్వతీపూర్ షేక్ పారాలో నివాసం ఉంటున్న సోమయ్య ఖాతున్, దోమజాడకు చెందిన షేక్ కైఫ్‌ గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ కైఫ్‌ ప్రేయసిని మానసికంగా హింసించడం ప్రారంభించాడు. కైఫ్‌ తన ప్రియురాలి ప్రైవేట్ ఫొటోలు కొన్ని ఆమెకు తెలియకుండా తీసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని నిత్యం బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన ఖాతూన్‌ శనివారం రాత్రి ప్రియుడు కైఫ్‌కి ఫోన్ చేశాడు. ఇద్దరూ తమ ఇంటి పక్కనే ఉన్న ఓ చెట్టుకింద కూర్చుని కాసేపు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఖాతూన్‌ ఏవో మాయమాటలు చెప్పి ప్రియున్ని చెట్టుకు కట్టేసింది. ఆ తర్వాత అతని జననాంగాలను కట్‌ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కైఫ్ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని.. రక్తసిక్తమైన స్థితిలో ఉన్న కైఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడు తున్నాడు. కైఫ్‌ ఫిర్యాదు మేరకు ప్రియురాలు సోమయ్య ఖాతున్‌ను దోమ్‌జూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కైఫ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, శారీరకంగా దాడి చేశాడని ఖాతుమ్‌ పోలీసులకు తెలిపింది. తనను పలుమార్లు చెప్పుతో కొట్టాడని ఆరోపించింది. పైగా తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెల్పింది. అతడి చిత్రహింసలు భరించలేక, అతని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఖాతుమ్‌ నిర్ణయించుకుని ఆదివారమే అతడి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్‌ చేసినట్లు తెల్పింది. అయితే కొన్ని కారణాల వల్ల అది విఫలమైందని, సోమవారం దొరికాడని పోలీసులకు తెల్పింది. చాలా క్లోజ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరి మధ్య ఎందుకు గొడవ మొదలైంది? ఈ ఘటనలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.