Viral Video: ఫుల్లుగా తాగిండు.. నాగుపాముతోనే ఆడుకున్నడు.. వామ్మో జర్రుంటే..

మందు బాబులం... మేము మందు బాబులం.. మందేస్తే మాకు మేమే మహారాజులం.. ఈ పాట ఈ మందు బాబుకు సరిగ్గా సూట్ అవుతుందేమో.. దారిన పోయే పామును పట్టుకుని.. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. మద్యం మత్తులో పాముతో చెలగాటమాడాడు ఓ మందుబాబు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఫుల్లుగా తాగిండు.. నాగుపాముతోనే ఆడుకున్నడు.. వామ్మో జర్రుంటే..
Viral Video
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 10, 2024 | 8:53 PM

మందు బాబులం… మేము మందు బాబులం.. మందేస్తే మాకు మేమే మహారాజులం.. ఈ పాట ఈ మందు బాబుకు సరిగ్గా సూట్ అవుతుందేమో.. దారిన పోయే పామును పట్టుకుని.. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. మద్యం మత్తులో పాముతో చెలగాటమాడాడు ఓ మందుబాబు… అనంతపురం పట్టణంలోని టీవీ టవర్ వద్ద ఓ మందు బాబు నాగుపాముతో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో పాముతో చెలగాటమాడడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పొదల్లోంచి రోడ్డు దాటుతున్న నాగుపామును ఓ మందు బాబు పట్టుకున్నాడు.. ఆ తర్వాత పాము ముందు కూర్చుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. పామును చేత్తో పట్టుకుని ఆడిస్తుంటే.. అది బుసలు కొడుతుంది. అయితే.. మందుబాబుతో పామును చూసినవారు భయంతో పరుగులు తీశారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..

వీడియో చూడండి..

ఫుల్లుగా తాగి ఉండటంతో.. నషా బాగా ఎక్కి.. పాముతో చాలా సేపు చెలగాటమాడాడు. పామును వదిలేయమని దగ్గరకొచ్చిన వారిని.. పాముతో కాటేయిస్తానంటూ బెదిరించాడు. రోడ్డుపై దాదాపు అరగంట పాటు మందుబాబు పాముతో చేసిన విన్యాసాలతో చుట్టుపక్కల ఉన్న వారు భయం తో పరుగులు తీశారు.. పాముకు ఎక్కడ కోపం వచ్చి మందుబాబును కాటేస్తుందోనని.. పామును వదిలేయమని స్థానికులు గట్టిగా మందలించారు. దీంతో చివరకు మందుబాబు పామును వదిలేసాడు. పాము ఏ మూడ్ లో ఉందో తెలియదు గానీ… మందుబాబు బచాయించాడు… లేకుంటే జర్రుంటే కాటేసేదని స్థానికులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..