బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు.. హైవేపై మకాం వేస్తారు.. లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే సంగతులు..
వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...!
వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…! సికింద్రాబాద్ ఇందిరమ్మనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొరపాటి నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమై స్నేహితులుగా మారారు. ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి కొత్త మార్గాన్ని అనుసరించారు. కార్లను అద్దెకు తీసుకుని వాటిని తనఖా పెట్టీ.. లిఫ్ట్ అడిగి మార్గమధ్యలో డ్రైవర్ ను బురిడీ కొట్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని పథకం వేశారు. బైకులను నకిలీ తాళాలతో తీసి చోరీ చేసి విక్రయించాలని చోరీలకు పాల్పడ్డారు.
సూర్యాపేటకు చెందిన మర్రు వెంకటేశ్వర్రావు విజయవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు తన కారులో కొత్త అక్టోబరు 27న వెళ్లాడు. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రసాద్, నర్సింగ రావులు విజయవాడ వెళ్లేందుకు లిఫ్ట్ అడిగి వెంకటేశ్వర్రావు కారులో ఎక్కారు. మార్గమధ్యంలో కారు యజమాని ఫోన్ నెంబరును నిందితులు తీసుకుని వారి నెంబరును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. విజయవాడకు వెళ్లగానే కారును రోడ్డు పక్క వెంకటేశ్వర రావు ఆన్లో ఉంచి ఓ దుకాణంలో మిఠాయి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు.. ఇదే అదునుగా భావించిన ప్రసాద్, నర్సింగరావులు ఆ కారుతో ఉడాయించారు. కారును పార్క్ చేసిన ప్రాంతానికి వెంకటేశ్వరరావు రాగా, కారు లేదు. చుట్టుపక్కల వెతికినా కారు కనబడలేదు. తనతోపాటు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది.
దీంతో బాధితుడు విజయవాడలోని కుమార్తె వద్దకు వెళ్లి అక్కడి నుంచి సూర్యాపేటకు చేరుకున్నాడు. ఈ విషయమై ఈ నెల 16న సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. కార్లతోపాటు ద్విచక్ర వాహనాలను సైతం నకిలీ తాళంచెవులతో చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి రెండు కార్లు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుడు ప్రసాద్ పై గతంలో రెండు కేసులు విశాఖపట్నంలో ఉన్నాయని ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..