AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో.. ఇలా ఎందుకు చేశావ్ తల్లీ.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి

తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Telangana: అయ్యో.. ఇలా ఎందుకు చేశావ్ తల్లీ.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి
Mother With Kids
P Shivteja
| Edited By: |

Updated on: Aug 18, 2024 | 5:56 PM

Share

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో.. భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో దూకి తనువు చాలించింది. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు గ్రామానికి చెందిన మార్కండేయ స్వామి, భానుప్రియ ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి దేవాంత్(5), దీక్ష(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూతురు దీక్షిత అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగేసరికి కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎక్కవయ్యాయి. రెండు రోజుల క్రితం స్వామికి తన భార్య భానుప్రియతో చిన్నపాటి గొడవ జరగగా, ఆ సమయంలో ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భానుప్రియ తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో స్వామి తన భార్య కోసం ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో, ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా శనివారం రాత్రి శామీర్‌పేట చెరువులో మృతదేహాలు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా చిన్నారుల బాడీలను బయటకు తీశారు. అర్ధరాత్రి తర్వాత మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహలను పరిశీలించి వారు ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ వారి పిల్లలుగా గుర్తించారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వెళ్లిన స్వామి..  ఆ మృతుదేహలను చూసి కన్నింటి పర్వతం అయ్యారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..