Hyderabad: డ్రగ్స్ కేసులో సంచలనాలు.. పుస్తకాలు, గాజులు, ఆయుర్వేద ఉత్పత్తులు దేన్ని వదల్లేదుగా!
పుస్తకాలు ఓపెన్ చేస్తే అక్షరాలు కాదు డ్రగ్స్ కనబడుతున్నాయి..! డిక్షనరీ తెరిస్తే తెలియని పదాలకు అర్ధాలకు కాదు.. మనిషి జీవితాన్ని సర్వనాశం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి..! కాలేజీలు, యూనివర్సిటీలకు పుస్తకాల కొరియర్లు కాదు.. డ్రగ్స్ పార్శిల్స్ డెలివరీ అవుతున్నాయి..! పబ్బులు, ఫామ్‌హౌజ్‌లు దాటుకుని విద్యాలయాలను డ్రగ్స్ గబ్బు పట్టిస్తున్నాయి..! వరుస స్టూడెంట్స్ కేసుల్లో వెలుగు చూస్తున్న విషయాలు వణికిస్తున్నాయి. మరీ డ్రగ్స్‌కు చెక్ పెట్టేదెలా...? విద్యార్థులకు డ్రగ్స్‌ను దూరం చేసేదెలా...? కొరియర్ కంపెనీలకు భయం, బాధ్యత నేర్పేదెలా..?

పుస్తకాలు ఓపెన్ చేస్తే అక్షరాలు కాదు డ్రగ్స్ కనబడుతున్నాయి..! డిక్షనరీ తెరిస్తే తెలియని పదాలకు అర్ధాలకు కాదు.. మనిషి జీవితాన్ని సర్వనాశం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి..! కాలేజీలు, యూనివర్సిటీలకు పుస్తకాల కొరియర్లు కాదు.. డ్రగ్స్ పార్శిల్స్ డెలివరీ అవుతున్నాయి..! పబ్బులు, ఫామ్‌హౌజ్‌లు దాటుకుని విద్యాలయాలను డ్రగ్స్ గబ్బు పట్టిస్తున్నాయి..! వరుస స్టూడెంట్స్ కేసుల్లో వెలుగు చూస్తున్న విషయాలు వణికిస్తున్నాయి. మరీ డ్రగ్స్‌కు చెక్ పెట్టేదెలా…? విద్యార్థులకు డ్రగ్స్‌ను దూరం చేసేదెలా…? కొరియర్ కంపెనీలకు భయం, బాధ్యత నేర్పేదెలా..?
పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు అని విన్నాం. ఫామ్‌హౌజ్‌ల్లో గంజాయి పార్టీలూ చూశాం.. చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్‌గా కాలేజీలు, యూనివర్సిటీల్లో కంపుకొడుతున్న డ్రగ్స్ కహానీని చూసి షాకవుతున్నాము. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వైద్యాన్నందించే డాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు. ఇలా ఈ మత్తు మహమ్మారి ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు. సిటీ బయట నుంచి లోపలికొచ్చి పట్టి పీడిస్తోంది. ఒక్కసారి అటువైపు చూశారో.. మత్తుగాళ్లను చేసి జీవితాన్నే చిత్తుచేసి పడేస్తోంది. ఇప్పుడా లిస్ట్‌లోకి విద్యార్థులూ చేరిపోయారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో వరుస తనిఖీలు చేస్తున్న అధికారులు.. ఎంతోమందిని అదుపులోకి తీసుకున్నారు. వరుస కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి.
యూనివర్సిటీ డ్రగ్స్ కేసుల్లో షాకింగ్ విషయాలు వెల్లడించారు అధికారులు. కొరియర్ల ద్వారానే కాలేజీలకు డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తేల్చారు. పుస్తకాలు, గాజులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాల మాటున విద్యార్థులకు డ్రగ్స్ సప్లై జరుగుతుండటం చూసి షాక్ అవుతున్నారు. అంతేకాదు.. డిక్షనరీల మధ్య హెరాయిన్ ప్యాకెట్లు గుర్తించారు. 10 కొరియర్ సంస్థల ద్వారా రెండేళ్లుగా డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 100 కోట్ల డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. కొరియర్ కంపెనీలకు భయం, బాధ్యత ఉండాల్సిందేని అధికారులు అంటున్నారు. ఒకే రకమైన కొరియర్ పదేపదే వస్తుండటం.. ఒకే ప్లేస్‌కు వందలసార్లు డెలివరీ అవుతున్నా అనుమానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్సిల్స్ కేసుల్లో కొరియర్ కంపెనీలను బాధ్యులను చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కొరియర్ సంస్థలపై కేసు నమోదు చేశారు.
మొత్తంగా… బోర్డర్లను బద్దలుకొట్టుకుని డ్రగ్స్ దూసుకొస్తుంటే.. సమూల ప్రక్షాళనే లక్ష్యంగా అధికారులు ప్రతిరోజూ అప్‌డేట్ అవుతున్నారు. పెడ్లర్ల పనిపడుతూనే… కన్జుమర్లకు కళ్లెం వేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టేషన్‌నూ బద్దలుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే టార్గెట్‌గా దూకుడు చూపిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




