Watch Video: ‘అయ్యో రామ – ఏమిటి ఈ ఖర్మ’.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పుణ్య క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దీనికి అనుబంధ ఆలయమైన పర్ణశాలలో భక్తులను ఆకట్టుకునే చారిత్రాత్మక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. సీతమ్మ వనవాసం చేసిన చారిత్రాత్మక ఆనవాళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పర్ణశాల కుటీరం ఉంది. సీతమ్మ నారచీరలను తిలకించేందుకు నిత్యం వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పుణ్య క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దీనికి అనుబంధ ఆలయమైన పర్ణశాలలో భక్తులను ఆకట్టుకునే చారిత్రాత్మక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. సీతమ్మ వనవాసం చేసిన చారిత్రాత్మక ఆనవాళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పర్ణశాల కుటీరం ఉంది. సీతమ్మ నారచీరలను తిలకించేందుకు నిత్యం వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడకు దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడి చేస్తూ కొత్తపుంతలకు తెరలేపారు కొందరు వ్యక్తులు. రాముడు వనవాసం చేసిన పర్ణశాలలో అడుగు పెట్టి అడుగు తీస్తే చాలు భక్తులను అందినకాడికి దండుకుంటున్నారు. వనవాస ప్రధాన ఘట్టాలైన పర్ణశాల కుటీరం, సీతమ్మ నారచీరేలు, సీతారాములు ఆడుకున్న వామనగుంటలు, శూర్పణక చెవులు, ముక్కు కోసిన ప్రాంతం ఇలా ఎంతో చారిత్రాత్మక ఘట్టాలను చూపిస్తూ ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తున్నారు. శ్రీసీతారాముల సాక్షిగా ముక్కు పిండి మరీ భక్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు.
అంతేకాకుండా రాముడు విల్లు ఎక్కుపెట్టి కొట్టగా పసువు, కుంకుమ వచ్చినట్లు చెప్తూ ఆ రంగులను పోల్చి ఉన్న రాళ్లను అమ్ముతూ భక్తుల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. రాముడి పాదాలకోరేటు, శూర్పణక గుట్ట, సీతమ్మ నారచీరలు, వామనగుంటలు స్టోరీ చెప్తూ జేబులకు చిల్లులు పెడుతుండటంతో రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన రామభక్తులకు అక్రమ వసూళ్ల తతంగంతో అయ్యో రామ ఏమిటి ఈ ఖర్మ అని బేజారించుకుంటున్నారు. వనవాసం చేసిన తిప్పలు నీకు, అవి చూడడానికి వచ్చిన మాకు వసూళ్ల రాయుళ్ల తిప్పలు అంటూ దేవస్థానం అధికారుల పర్యవేక్షణ లోపంపై రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పర్ణశాల క్షేత్రంలో ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చే భక్తులను అక్రమ వసూళ్లు చేస్తూ.. ఈ క్షేత్రానికి ఉన్న పేరును చెదగొడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




