AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో అధికారుల్లో గుబులు

తిరుపతి జిల్లాలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘటనలపై ఈసీ తీసుకున్న సీరియస్ యాక్షన్ అధికారుల్లో గుబులు రేపుతోంది. చంద్రగిరి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తరువాత రోజు జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ కొరడా జులిపించింది. ఎలక్షన్ ఎఫెక్ట్ కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తుంది. తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్‎తో పాటు మరో నలుగురు పోలీస్ అధికారులపై వేటు వేసింది.

ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో అధికారుల్లో గుబులు
Padmavathi University
Raju M P R
| Edited By: Srikar T|

Updated on: May 19, 2024 | 11:14 AM

Share

తిరుపతి జిల్లాలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘటనలపై ఈసీ తీసుకున్న సీరియస్ యాక్షన్ అధికారుల్లో గుబులు రేపుతోంది. చంద్రగిరి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తరువాత రోజు జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ కొరడా జులిపించింది. ఎలక్షన్ ఎఫెక్ట్ కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తుంది. తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్‎తో పాటు మరో నలుగురు పోలీస్ అధికారులపై వేటు వేసింది. ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్‏ను బదిలీ చేసిన ఈసీ తిరుపతి DSP సురేంద్ర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ DSP భాస్కర్ రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ రాజశేఖర్ సస్పెండ్ చేసింది. ఇక పోలింగ్ రోజు చంద్రగిరి మండలంలో 5 చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలువ పోలింగ్ కేంద్రంలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టిడిపి అభ్యర్థి పులపర్తి నాని సొంత గ్రామం పులివర్తి వారి పల్లిలో వైసిపి అభ్యర్థి మోహిత్‎ను గ్రామస్తులు అడ్డుకోవడంతో గొడవ జరగ్గా వైసీపీ అభ్యర్థి సొంత గ్రామం తుమ్మలగుంటలోనూ టిడిపి నేతపై దాడికి ప్రయత్నం జరిగింది.

ఇక చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిలో టిడిపి వైసిపి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. రామిరెడ్డి పల్లికి వచ్చిన వైసిపి అభ్యర్థి మోహిత్ వాహనాలపై కూచువారిపల్లికి చెందిన వారు దాడి చేసి కార్లను తగలబెట్టారు. స్థానిక వైసిపి నేత ఇంటిని కూడా ధ్వంసం చేశారు. పోలింగ్ ముగిశాక ఈ నెల 14 న తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద రణరంగమే జరిగింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన వైసీపీ కేడర్ దాడి చేయగా పోలీసు వాహనంతో పాటు, ఇతరుల వాహనాలు ధ్వంసం చేసి తగుల పెట్టారు టిడిపి శ్రేణులు. ఇలా దాడులు ప్రతి దాడులు జరగ్గా వరుస హింసాత్మక ఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఈసీ భావించింది.

తిరుపతి ఎస్పీని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ఈసీ.. ఇద్దరు డిఎస్పీలు మరో ఇద్దరు సీఐల సస్పెండ్ చేయడంతో పోలీసు యంత్రాంగంలో అంతర్మధనం నెలకొంది. మరి కొందరిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని గుర్తించి తిరుపతికి మరో 4 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కూడా వచ్చాయి. సమస్యాత్మక గ్రామాల వివరాలను స్టేషన్ల వారీగా పంపాలని ఏఎస్పీకి ఆదేశించిన ఈసీ ఈ మేరకు ఫోకస్ పెట్టింది. మరోవైపు చంద్రగిరి తిరుపతి లో జరిగిన దర్యాప్తుకు సిట్ బృందం కూడా రంగంలో దిగింది. ఇప్పటికే నమోదైన కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పెంపుకు ఆదేశించిన ఈసీ 3 అంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, స్థానిక పోలీసులతో భద్రత పటిష్ఠం చేసింది. స్ట్రాంగ్ రూం పరిసరాలను దాదాపు 80 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పటికే నానిపై జరిగిన హత్యాయత్నం కేసుల్లో 13 మంది అరెస్ట్ చేయగా రామిరెడ్డి పల్లి, కుచువారిపల్లిలో జరిగిన విధ్వంసంపై మరిన్ని కేసులు నమోదు చేసి అరెస్ట్‎లు చేయాల్సి ఉంది. చంద్రగిరి అభ్యర్థులను గృహనిర్బంధం చేసి ఇళ్ల వద్ద భద్రత పెంచిన పోలీసు యాత్రంగం షాడో పార్టీల ఏర్పాటు చేసింది. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన అల్లర్లపై నమోదైన కేసులను ఆరా తీసిన సిట్ క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసింది. ఈ నెల 14 న పద్మావతి యూనివర్సిటీ ముందు అల్లరిమూకల దాడిలో ఎంఆర్ పల్లి సీఐ కి గాయాలు కాగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు సీఐ ఇవ్వలేదని గుర్తించింది. మరోవైపు టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి సమయంలో గాయపడ్డ గన్ మెన్ ధరణి ఫైరింగ్ చేసినా కూడా ఫిర్యాదు ఇవ్వకపోవడంపై ఆరా తీసింది. పోలీసు శాఖకు చెందిన వజ్రా వాహనం ధ్వంసంపై కూడా కేసు నమోదు కాక పోవడాన్ని ప్రశ్నించింది. దాడులపై పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న దానిపై కూడా పెద్ద చర్చనే నడుస్తోంది.

స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన..

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‎ను జిల్లా ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్ కుమార్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటుకు సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద నాలుగు అంచెల భద్రత ఉందన్నారు. ఎవరు యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలనుకున్నా సంతకం పెట్టి పూర్తి భద్రత నడుమ వెళ్ళాలని సూచించారు. సీఎస్, డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి రోజు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన చేయాల్సి ఉండగా అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా సీసీ కెమెరాలను పరిశీలించుకునే ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు. సిట్ ఏర్పాటుపై అధికారికంగా సమాచారం లేదన్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సిట్ బృందానికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నెల 13, 14 న నెలకొన్న శాంతి భద్రతల సమస్య పై ఇప్పటికే జిల్లా మెజిస్ట్రేట్‎గా నివేదిక ఇచ్చామన్నారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలపై FIR లు నమోదు అయ్యాయనీ ఇంకా దాడికి సంబంధించిన ఫిర్యాదులు చేయకపోయినా తప్పక ఫిర్యాదు చేయాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్.

దాడికి ప్రతి దాడి జరిగిందంటున్న వైసీపీ..

ఒకవైపు సిట్ దర్యాప్తు.. మరోవైపు కేసులు, అరెస్టులతో చంద్రగిరి అల్లర్ల వ్యవహారం అట్టుడికి పోతుండగా చంద్రగిరి టిడిపి అభ్యర్థి ఫులివర్తి నానిపై దాడే జరగలేదని చెబుతోంది వైసీపీ. నానిపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన వారి కుటుంబసభ్యులు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రామచంద్రాపురం జడ్పిటిసి ఢిల్లీరాణితో పాటు పలువురు మహిళలు మీడియా ముందుకు వచ్చారు. పులివర్తి నానిపై జరిగిన దాడిలో రామచంద్రాపురం ZPTC ఢిల్లీ రాణి భర్త భాను కుమార్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని.. ఆయనను రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారని వైసిపి ఆరోపిస్తోంది. రాజకీయ డ్రామా లాడుతున్నాడని ఆరోపించిన రామచంద్రపురం జడ్పిటిసి ఢిల్లీ రాణీ తన భర్త భాను కుమార్ రెడ్డి పులివర్తి నానిపై దాడి చేయలేదని చెబుతోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు కాబట్టే నాని వాహనంపై ప్రతి దాడికి పాల్పడ్డారని చెబుతోంది. ఇది దాడికి ప్రతి దాడి మాత్రమే నంటున్న వైసీపీ జడ్పిటిసి ఢిల్లీరాణి.. నానికి ఎలాంటి గాయాలు కాలేదని చెబుతోంది. రాత్రి కంతా కట్లు కట్టుకుని ఆసుపత్రిలో చేరారని, పులివర్తి నాని కారులో కత్తులు పెట్టుకుని బెదిరిస్తున్నారని చెబుతోంది. సిట్ బృందాన్ని కలిసి అన్ని విషయాలు వివరిస్తామంటున్నారు రామచంద్రాపురం వైసీపీ ZPTC ఢిల్లీరాణి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!