AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..

పెద్దపల్లి పార్లమెంటు పోలింగ్‎పై ఆసక్తి నెలకొంది. పొలింగ్‎కి రెండు రోజుల ముందు కాంగ్రెస్ హవా స్పష్టంగా కనబడింది. కనీసం రెండు లక్షలపైగా మెజారిటితో విజయం సాధిస్తామనే ధీమాతో పార్టీ‌శ్రేణులు ఉన్నాయి. కానీ పోలింగ్ రోజు అందుకు భిన్నమైన ఓటింగ్ సరళీ కనబడింది. పైకి‌ కాంగ్రెస్ గెలుస్తామని ధీమాతో ఉన్నా లోలోపల ఎదో‌ గుబులు కనబడుతుంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉండడంతో పోరు కూడ రసవత్తరంగా మారింది.

Telangana: ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
Brs Bjp Congress
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: May 19, 2024 | 11:12 AM

Share

పెద్దపల్లి పార్లమెంటు పోలింగ్‎పై ఆసక్తి నెలకొంది. పొలింగ్‎కి రెండు రోజుల ముందు కాంగ్రెస్ హవా స్పష్టంగా కనబడింది. కనీసం రెండు లక్షలపైగా మెజారిటితో విజయం సాధిస్తామనే ధీమాతో పార్టీ‌శ్రేణులు ఉన్నాయి. కానీ పోలింగ్ రోజు అందుకు భిన్నమైన ఓటింగ్ సరళీ కనబడింది. పైకి‌ కాంగ్రెస్ గెలుస్తామని ధీమాతో ఉన్నా లోలోపల ఎదో‌ గుబులు కనబడుతుంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉండడంతో పోరు కూడ రసవత్తరంగా మారింది.

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 67.8 శాతం పొలింగ్ నమోదు అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ‌జరిగిన పోలింగ్ శాతం కుడా దాదాపుగా సమానంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ కాంగ్రెస్‎కి పట్టు ఉన్న నేపథ్యంలో వివేక్ తనయుడు వంశీకృష్ణ బరిలొకి దిగారు. బీఅర్ఎస్ నుండి కొప్పుల ఈశ్వర్, బిజేపి నుండి‌ గోమాస శ్రీనివాస్ పోటీ చేసారు. నామినేషన్ వరకు బిజేపిలో అంతర్గత విభేధాలతో క్యాడర్ సరిగా పనిచేయలేక పోయింది. బీఅర్ఎస్ ముఖ్య నేతలు కూడ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కారణంగా అనుకున్న స్థాయిలో ప్రచారాన్ని‌ ముమ్మరంగా చేయలేకపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకగానే భావించారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుండే అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. కానీ పోలింగ్ రోజు కొన్ని భిన్నమైన పరిస్థితులు కనబడ్డాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంది. చివరి నిమిషంలో‌ బీఆర్ఎస్ శ్రేణులు బిజేపికి‌ మద్దతుగా ఓటు వేశారు. ఇక్కడ పోలింగ్ సరళి చూస్తే ఏకపక్షంగా కాంగ్రెస్‎కు ఓటు పడలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఅర్ఎస్ కూడా కార్మిక క్షేత్రాలు అయిన రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలలో కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అర్బన్ ఓటర్లు బిజేపికి ఎక్కువగా ఓట్లు వేసినట్లు పోలింగ్ సరళి బట్టి తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్‎ని ఆదరించారు. ఇక్కడ ఓట్లు చీలీపోవడంతో కాంగ్రెస్ దిగులు చెందుతుంది. అయితే ఇది ప్రచారం మాత్రమే ఖచ్చితంగా లక్ష యాభై వేలకి పైగానే మెజారిటీతో గెలుస్తామని ధీమాని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

ఇవి కూడా చదవండి

మొదడి నుండి అనుకున్న స్థాయిలో బిజేపి ప్రచారం చేయలేక పోయింది. చాల చోట్ల అభ్యర్థి ప్రచారం చేయలేదు. క్యాడర్ కూడ ఎక్కడా ఉత్సాహంగా పనిచేసిన పరిస్థితి కనబడలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటిగా ప్రచారం నిర్వహించింది. కానీ పోలింగ్ రోజు మాత్రం ఇక్కడ మోడీ మేనియా స్పష్టంగా కనబడింది. మూడు పార్టీలు కుడా పోటాపోటీగా ఓట్లు రావడంతో గెలుపు గురించి పూర్తి భరోసాగా చెప్పలేక పోతున్నారు. అధికార పార్టీ‌ మాత్రం ప్రతిపక్షాలకు ఓట్లు పడినా తమ గెలుపుని ఎవరు ఆపలేరని ధీమాతో‌ ఉంది. మొత్తానికి పెద్దపల్లి ‌పార్లమెంటు‌ ఫలితాలు ఉత్కంఠగా మారే అవకాశం ‌ఉందని రాజకీయ‌ పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…