Telangana: ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
పోలీసుల కథనం ప్రకారం.. కొనిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన 26 ఏళ్ల దూరి అనూష ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మాల్‌లో చిరుద్యోగిగా పనిచేస్తుంది. ప్రతీరోజు కొణిజర్ల నుంచి ఖమ్మం ఆర్టీసీ బస్సులో వెళ్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా కొనిజర్లలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే అదే సమయంలో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు...
తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రయాణికుల రద్దీ.? డ్రైవర్ నిర్లక్ష్యం.? కారణం ఏదో కానీ.. ఇద్దరు బిడ్డలకు తల్లిని లేకుండా చేసింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. కొనిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన 26 ఏళ్ల దూరి అనూష ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మాల్‌లో చిరుద్యోగిగా పనిచేస్తుంది. ప్రతీరోజు కొణిజర్ల నుంచి ఖమ్మం ఆర్టీసీ బస్సులో వెళ్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా కొనిజర్లలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే అదే సమయంలో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. కనీసం బస్సు లోపలికి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫుట్‌బోర్డ్‌పైనే నిల్చుంది అనూష.
ఈ క్రమంలోనే బస్సు ప్రయాణం మొదలైంది. అయితే బస్సు కొంత దూరం వెళ్లగానే ముందు వెళ్లే మరో బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలోనే డ్రైవర్ వేగంగా బస్సును మూవ్ చేశాడు. దీంతో ఫుట్‌బోర్డ్‌పై ఉన్న అనూష అదుపు తప్పి బస్సు నుంచి కింద పడ్డారు. దీంతో వెనక టైరు ఆమె శరీరం పైనుంచి వెళ్లడంతో అనూష అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కళ్లెదుటో జరిగిన దారుణ సంఘటన చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
విషయం తెలుసుకున్న ఎస్సై శంకరరావు, ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనూష భర్త అశోక్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనూషకు ఆరేళ్ల లోపు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..