TS EAPCET 2024 Toppers List: తెలంగాణ ఈఏపీసెట్ టాప్ 10 ర్యాంకర్లు వీరే.. ర్యాంక్ కార్డు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం (మే 18) విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత..
హైదరాబాద్, మే 19: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం (మే 18) విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను కూడా విద్యార్ధులకు అందుబాటులో ఉంచారు. ర్యాంక్ కార్డు పొందేందుకు విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, ఈఏపీసెట్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శనివారం విడుదలైన ఈఏపీసెట్ పలితాల్లో రెండు స్ట్రీమ్‌లలో టాప్ 10 ర్యాంకులు సాధించిన ర్యాంకర్లు వీరే..
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాప్ 10 ర్యాంకర్లు వీరే..
- శ్రీకాకుళం-పాలకొండకు చెందిన ఎస్.జ్యోతిరాదిత్య- ఫస్ట్ ర్యాంక్
- కర్నూలు-పంచలింగాలకు చెందిన హర్ష రెండో ర్యాంకు
- సికింద్రాబాద్-తిరుమలగిరికి చెందిన రిషి శేఖర్‌శుక్లా మూడో ర్యాంక్
- హైదరాబాద్-మాదాపూర్‌కు చెందిన సందేశ్ – నాలుగో ర్యాంకు
- ఏపీలోని కర్నూలుకు చెందిన సాయియశ్వంత్‌రెడ్డి – ఐదో ర్యాంకు
- ఏపీలోని అనంతపురంకు చెందిన పుట్టి కుశల్ కుమార్ – ఆరో ర్యాంకు
- హైదరాబాద్-పుప్పాలగూడకు చెందిన హుండికర్ విదీత్ – ఏడో ర్యాంకు
- హైదరాబాద్-ఎల్లారెడ్డి గూడకు చెందిన రోహన్- ఎనిమిదో ర్యాంకు
- వరంగల్-ఘన్‌పూర్‌కు చెందిన కొంతేమ్ మణితేజ- తొమ్మిదో ర్యాంకు
- ఏపీలోని విజయనగరంకు చెందిన ధనుకొండ శ్రీనిధి- పదో ర్యాంకు
అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో టాప్ 10 ర్యాంకర్లు వీరే..
- మదనపల్లెకు చెందిన ప్రణీత- ఫస్ట్ ర్యాంకు
- విజయనగరంకు చెందిన రాధాకృష్ణ – రెండో ర్యాంకు
- హనుమకొండకు చెందిన శ్రీవర్షిణి- మూడో ర్యాంకు
- చిత్తూరుకు చెందిన సాకేత్ రాఘవ్- నాలుగో ర్యాంకు
- హైదరాబాద్-ఆసిఫ్‌నగర్‌కు చెందిన సాయి వివేక్- ఐదో ర్యాంకు
- హైదరాబాద్-నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్‌సాద్ – ఆరో ర్యాంకు
- తిరుపతి-వెంగమాంబపురంకు చెందిన వడ్లపూడి ముకేశ్ చౌదరి- ఏడో ర్యాంకు
- హైదరాబాద్-పేట్‌బషీరాబాద్‌కు చెందిన భార్గవ్ సుమంత్ – ఎనిమిదో ర్యాంకు
- హైదరాబాద్-అల్విన్ కాలనీకి చెందిన జయశెట్టి ఆదిత్య – తొమ్మిదో ర్యాంకు
- శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేటకి చెందిన దివ్యతేజ – పదో ర్యాంకు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.