Adilabad: అబ్బా.. ఆ ఊరంతా టమాటా కూరే..! బోల్తాపడ్డ వ్యాన్.. ఎగబడ్డ జనాలు..
టమాట లోడ్ ను మరో వాహనంలో తరలించేందుకు ఐదు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు స్థానిక పోలీసులు. అసలే దొంగలుపడి టమాటను బంగారంలా ఎత్తుకెలుతున్న కాలం కావడంతో టమాట లోడ్ వెళ్లేంత వరకు భద్రత ఇవ్వక తప్పదని చెప్తున్నారు.
టమాటకు దేశ వ్యాప్తంగా భాగ్యం పట్టుకుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ రహదారిల పై టమాటకు కాలం కలిసి రావడం లేదు. టమాట లోడ్ తో వెళ్తున్న వాహనాలు ఉమ్మడి ఆదిలాబాద్ రోడ్లపై పల్టీలు కొడుతున్నాయి. టమాట లారీలు బోల్తా పడ్డాయనే సమాచారం రావడమే ఆలస్యం పోలీసులకు సవాల్ గా మారుతోంది. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్ లో టమాట వాహనాల బోల్తా అందుకు నిదర్శనం గా నిలుస్తోంది.
గత వారం రోజుల క్రితం.. జూలై 15 న కర్ణాటక కొల్లార్ నుండి ఢిల్లీ వెళుతున్న టమాట లారీ ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద బోల్తా పడింది. 30 లక్షల విలువ చేసే టమాట లోడ్ నేల పాలవడంతో జనం టమాటల కోసం ఎగబడ్డారు.. సీన్ కట్ట చేస్తే ఆ టమాటలను కాపాడేందుకు గన్ లతో పోలీసులు కాపాల కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఆసిపాబాద్ జిల్లాలో సేమ్ సీన్ పునరావృతమైంది.
కొమురం భీం జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామ శివారులోని జాతీయ రహదారిపై టమాటా లోడుతో, వెళ్తున్న ఐచార్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా.. 15 లక్షల విలువ చేసే టమాట నేలపాలైంది. ఐచర్ వాహనం బోల్తా పడడంతో అందులోని టమాటాలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడిపోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక జనం టమాటల కోసం ఎగబడ్టారు. అయితే డ్రైవర్ అప్పటికే అలర్ట్ అయి స్థానికుల పోలీసులకు సమచారం ఇవ్వడంతో టమాటలు దొంగిలించకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
చివరికి ఆ టమాటల కోసం వచ్చిన జనమే నేలపాలైన టమాటలను భద్రంగా క్యారెట్ బాక్స్ ల్లో నింపడం గమనార్హం. టమాట లోడ్ ను మరో వాహనంలో తరలించేందుకు ఐదు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు స్థానిక పోలీసులు. అసలే దొంగలుపడి టమాటను బంగారంలా ఎత్తుకెలుతున్న కాలం కావడంతో టమాట లోడ్ వెళ్లేంత వరకు భద్రత ఇవ్వక తప్పదని చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..