Milk Adulteration : వామ్మో మామూలు కల్తీ కాదు.. తొమ్మిదిలో మూడు పాళ్లు నీళ్లే..!
ఇలా తొమ్మిది వేల లీటర్లతో వెళ్తున్నటువంటి పాల ట్యాంక్ నుంచి ఏకంగా మూడు వేల లీటర్ల పాలను దోచుకొని పాలల్లో నీళ్లను కలిపి కల్తీగా మారుస్తున్నారు. ఈ పాలల్లో ఇంకేమైనా పదార్థాలు కలిపిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పాల టాంకర్ వెంకన్న తో సహా ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు.
కల్తీ…తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్ని కల్తీలే… కల్తీ పదార్థాల మీద పోలీసులు ఉక్కు పాదం మోపిన కల్తీ రాయుళ్లు ఎక్కడో ఒక దగ్గర రెచ్చిపోతూనే ఉన్నారు చిన్నపిల్లలు తినేటటువంటి చాక్లెట్లు ఐస్ క్రీములు ఏ కాకుండా టీ పొడి అల్లం పేస్ట్ నూనె ఈ విధంగా ఎన్నో కల్తీ పదార్థాలను తయారు చేస్తూ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఈ కల్తీ రాయుళ్లు. తాజాగా కల్తీ పాల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు…కర్నూల్ నుంచి నాగపూర్ వెళ్తున్న ఓ పాల ట్యాంక్ డ్రైవర్ తో పాటు 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు,మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు..ఇక 3వేల లీటర్ల పాల తో పాటు,పాల టీన్లను సీజ్ చేశారు శంషాబాద్ SOT పోలీసులు.. నిందితులను పోలీసులు అప్పగించారు..
కర్నూల్ జిల్లాలో పాల వ్యాపారం చేస్తున్న అవినాష్ రెడ్డి , నరసింహ అనే ఇద్దరు వ్యక్తులు.. వివిధ గ్రామాల నుంచి పాలను సేకరించి కొంతమందికి విక్రయిస్తారు… మిగతాపాలను పాల ట్యాంకు ద్వారా నాగపూర్ కు చేరవేస్తారు.. ఈ క్రమంలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకన్న కర్నూల్ నుంచి శంషాబాద్ మీదుగా నాగపూర్ పాలను పాల ట్యాంకర్ ద్వారా చేర్చేందుకు వెళుతుంటాడు…ఇలా 9 వేల లీటర్ల పాల లోడ్ తో వెళ్తున్న వెంకన్న శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే కొద్ది దూరంలో ఉన్నటువంటి పార్కింగ్ లో పాల ట్యాంకును ఆపుతాడు.. ఇక మేడ్చల్ కు చెందిన శేఖర్ అనే ఒక వ్యక్తి స్వీట్ షాప్ బిజినెస్ తో పాటు పాలు, పెరుగు బిజినెస్ను చేస్తూ ఉంటాడు.. వెంకన్న దగ్గర నుంచి పాలు రావడం కోసం శేఖర్.. ముగ్గురు చండీలాల్, చేతన్, సచిన్ అనే ఆటో డ్రైవర్లను నియమించుకున్నాడు.
తొండిపల్లి వద్ద పాల ట్యాంకును నిలుపుకొని ఉన్న వెంకన్న వద్దకు ఈ ముగ్గురు ఆటో డ్రైవర్లు తమ తమ ఆటోలలో 40 లీటర్లు కలిగిన 83 పాల టిన్నులను తీసుకొని వెళ్తారు… అనంతరం అక్కడికి వెళ్లాక తీసుకు వచ్చినటువంటి పాల టిన్నులలో నీటిని కూడా తీసుకొని వస్తారు.. వాళ్లకు కావలసిన పాలను తీసుకొని నీటిని పాల టాంకులు కలుపుతారు ..ఇలా తొమ్మిది వేల లీటర్లతో వెళ్తున్నటువంటి పాల ట్యాంక్ నుంచి ఏకంగా మూడు వేల లీటర్ల పాలను దోచుకొని పాలల్లో నీళ్లను కలిపి కల్తీగా మారుస్తున్నారు. ఈ పాలల్లో ఇంకేమైనా పదార్థాలు కలిపిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పాల టాంకర్ వెంకన్న తో సహా ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు. మేడ్చల్ కు చెందిన ప్రధాన నిందితుడు శేఖర్ పరారీలో ఉన్నాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..