తెలంగాణలో బీజేపీ కొత్త ప్లాన్.. ఆషాడం తర్వాతే అంతా
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయినట్టుగా కనిపించింది. దానికి ఆద్యం పోస్తూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పు కూడా క్యాడర్లో జోష్ ని తగ్గించింది. ఇక దీంతో తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది అనే వార్తలు వస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయినట్టుగా కనిపించింది. దానికి ఆద్యం పోస్తూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పు కూడా క్యాడర్లో జోష్ ని తగ్గించింది. ఇక దీంతో తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. దాన్ని అధిగమించేందుకు.. పార్టీలో ఉత్సాహం తెచ్చేందుకు బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అధ్యక్ష పదవిని చేపట్టిన కిషన్ రెడ్డి వస్తు రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి కార్యాచరణ తీసుకొని తన వైపు చూపు తిప్పుకునేలా చేశారు. రెండు రోజులపాటు వరస మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ జరుగుతుండగానే చేరికల పైన ఫోకస్ పెట్టారు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
ఇప్పటికే కిషన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తాండూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు కిషన్ రెడ్డితో మంతనలు జరిపారు. కోర్ కమిటీ మీటింగ్ లో కూడా చేరికల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కావాలని ప్రయత్నాలు చేస్తుంది బిజేపీ. ముఖ్యంగా జిల్లాల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక నేత చేరికలకు సంబంధించి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 15 మంది ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం.
ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసలు ఉంటాయని బీజేపీ నేతలు లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొంత మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈనెల 30 తర్వాత ముహూర్తం చూసుకొని పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే పార్టీలు మిగిలిన అంశాల కోసం రాష్ట్ర నేతలకు పని విభజన పూర్తి కావడంతో బీజేపీ నేతలు ఎవరికి వారు పని మొదలు పెట్టారు. ఆగస్టు మొదటి వారంలో చేరికలు స్పీడ్ అందుకోనున్నాయని.. జోష్ మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.