కాంగ్రెస్‌లో కుమ్ములాట..! అధిష్టానంపై అలిగిన పొన్నం.. నేనున్నానంటూ సర్ధి చెప్పిన కోమటిరెడ్డి..
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి స్థానం లేకపోవడం అనేది అవమానకరమంటూ తమ నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితిలో ఆయనకు సరైన స్థానం కల్పించాలని కరీంనగర్ నుంచి వచ్చిన పొన్నం అనుచరులు గాంధీభవన్ మెట్ల దగ్గర ధర్నాకు దిగారు. ఒకవైపు గద్వాలకు సంబంధించిన నాయకుల చేరికలతో బిజీగా ఉంటే మరోక వైపు పొన్నం అనుచరుల ఆందోళనతో వాతావరణం వేడెక్కింది.
కర్ణాటక ఫలితాల తర్వాత నాయకుల మధ్య సయోధ్య కుదిరిందని అందరూ ఒకే లైన్లో పని చేస్తున్నారని అర్థం వచ్చేలా అందరూ నాయకులు కలిసికట్టుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. వరుస మీటింగ్‌లతో కొత్త జాయినింగ్‌లతో పార్టీ కలకలలాడుతుంది. ఇదిలాగే ఉంటే.. అది కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుంది..? కచ్చితంగా ఏదో ఒక గొడవ ఉండాల్సిందే..! అయితే అధిష్టానం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని ప్రకటించారు. అందులో కొంతమంది పేర్లు గల్లంతయ్యాయి. పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, చిన్నారెడ్డి ఇలాంటి నాయకుల పేర్లు ఆ కమిటీలో లేవు. తమ పేరు లేకపోవడంపై కొంతమంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పొన్నం ప్రభాకర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి తన నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. గాంధీభవన్‌లో ఆదివారం రోజున టీపీఎస్సీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై పొన్నం అనుచరులు గాంధి భవన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి స్థానం లేకపోవడం అనేది అవమానకరమంటూ తమ నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితిలో ఆయనకు సరైన స్థానం కల్పించాలని కరీంనగర్ నుంచి వచ్చిన పొన్నం అనుచరులు గాంధీభవన్ మెట్ల దగ్గర ధర్నాకు దిగారు. ఒకవైపు గద్వాలకు సంబంధించిన నాయకుల చేరికలతో బిజీగా ఉంటే మరోక వైపు పొన్నం అనుచరుల ఆందోళనతో వాతావరణం వేడెక్కింది.
ఇంతలో అక్కడికి చేరుకున్న భువనగిరి ఎంపీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన చేస్తున్న పొన్నం అభిమానుల దగ్గరికి వచ్చి ఆందోళన ఆపాలని అవసరమైతే తన స్థానాన్ని తీసేసి పొన్నం ప్రభాకర్‌కు ఆ స్థానాన్ని ఇవ్వాలని కోరుతానంటూ ఆందోళనను విరమింప జేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు ఇన్చార్జి థాక్రె ని కలిసి తమ వినతిపత్రం కూడా అందజేశారు. కీలకమైన కమిటీలో పొన్నం కు స్థానం దక్కుతుందని హామీ ఇచ్చారు ఇంచార్జి. దీంతో ప్రస్తుతానికి ఆందోళన విరమించారు పొన్నం అనుచరులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..