AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటినిండా చీమలతో చిర్రెత్తిపోతున్నారా..? వదిలించుకోవడానికి సులభమైన టెక్నిక్..

చీమలు వివిధ వాసనలు ఉపయోగించి వివిధ సంకేతాలను ప్రసారం చేస్తాయి. కాబట్టి, చీమలు చనిపోయినప్పుడు, వాటి శరీరాలు కుళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు అవి ఒలీక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇది ఇతర చీమలకు తెలుస్తుంది.

ఇంటినిండా చీమలతో చిర్రెత్తిపోతున్నారా..? వదిలించుకోవడానికి సులభమైన టెక్నిక్..
Ants
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2023 | 9:04 PM

Share

కొన్ని రకాల తెగులు కీటకాలు, సాధారణంగా ఇళ్లలో చాలా ఇబ్బంది, నష్టాన్ని కలిగిస్తాయి. చీమలు దానికి ప్రధాన ఉదాహరణ. చీమల ముట్టడి చాలా సాధారణమే కానీ, కొన్ని కొన్ని సార్లు చీమల బెడద మామూలుగా ఉండదు. చీమలు ఎలాంటి రోగాలను వ్యాప్తి చేయవు. ఎలాంటి హాని కూడా చేయవు. అయినప్పటికీ, మీరు వాటిని తరచుగా వైరస్లు, బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు, ధూళి మూలాల దగ్గరే కనిపిస్తుంటాయి. అక్కడ అవి వాటి ఆహారం కోసం తిరుగుతాయి. చీమలు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను ఎంచుకొని మనం తినే ఆహారంలో అలాంటి హానికర వైరస్‌, బ్యాక్టరీయాలను వ్యాప్తి చేయగలవు. అలాంటి చీమల్లోని రకాలు, వాటిని వదిలించుకోవటం ఎలాగో ఇక్కడ తెసుకుందాం..

కార్పెంటర్ చీమలు.. ఈ చీమలు ప్రపంచంలోని అతిపెద్ద చీమలలో ఒకటి. చెదపురుగుల వలె ఇవి మీ ఇంటిలోని ఫర్నిచర్‌కు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రకం చీమలు ఎల్లప్పుడూ నీరు, ఆహారం, వెచ్చదనం మూలాల దగ్గర గూళ్ళ కోసం వెతుకుతాయి. ఇవి మీ గోడలు, ఫర్నిచర్ లోపల రంధ్రాలు, బొరియలు ఏర్పాటు చేసుకుని తమ ఇంటిని తయారు చేసుకుంటాయి. ఇలాంటి చీమల పట్ల జాగ్రత్తగా, పరిశుభ్రంగా ఉండాల్సి ఉంటుంది.

మిగిలిపోయిన ఆహారం, పంచదారతో చేసిన స్నాక్స్ వంటివి ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా చూసుకోండి. ఇలాంటి ఆహారాల పట్ల ఈ కార్పెంటర్‌ చీమలు తొందరగా ఆకర్షితమవుతాయి. కుళ్ళిన వస్తువులను ఎప్పటికప్పుడు బయట పరేయాలి. కుళ్ళిన పండ్లను,ఎక్కువసేపు తెరిచి ఉంచిన ఆహారాన్ని చాలా త్వరగా తింటాయి. కాబట్టి, మీరు వాటిని వెంటనే దూరంగా పరేయటం మంచిది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి చీమలను కొన్ని ఘాటైన వాసనలు తరిమికొడతాయి. కాబట్టి, పిప్పరమెంటు, యూకలిప్టస్ సువాసన, నూనె వంటి వాటిని పిచికారీ చేయటం వల్ల చీమలు రాకుండా చూసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ చీమలను ఆహారంగా ఆకర్షిస్తుంది. కానీ, వాటిని జీర్ణించుకునే శక్తి వాటికి ఉండదు. కాబట్టి మొక్కజొన్న పిండి ప్రభావవంతమైన పురుగుమందుగా పనిచేస్తుంది.

చీమలు వివిధ వాసనలు ఉపయోగించి వివిధ సంకేతాలను ప్రసారం చేస్తాయి. కాబట్టి, చీమలు చనిపోయినప్పుడు, వాటి శరీరాలు కుళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు అవి ఒలీక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇది ఇతర చీమలకు తెలుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..