Telangana: దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఈ నెల 30న..

టీ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తోంది. వరుస సమావేశాలతో క్యాడర్‌లో జోష్‌ పెంచుతోంది. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన PAC కీలక భేటీ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం, భవిష్యత్‌ ప్రణాళిక, ప్రియాంక పర్యటన, బస్సుయాత్రలపై చర్చించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి..

Telangana: దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఈ నెల 30న..
Ts Congress
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2023 | 9:21 PM

టీ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తోంది. వరుస సమావేశాలతో క్యాడర్‌లో జోష్‌ పెంచుతోంది. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన PAC కీలక భేటీ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం, భవిష్యత్‌ ప్రణాళిక, ప్రియాంక పర్యటన, బస్సుయాత్రలపై చర్చించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతల పీఏసీ సమావేశం ఆదివారం జరిగింది.

దాదాపు 3గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. నెల 30న కొల్లాపూర్‌లో ప్రియాంకగాంధీ సభ, బస్సుయాత్రపై చర్చించినట్లు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయన్నారు. దాంతోపాటు ఆగస్టు 15న ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ గర్జన సభ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షత జరుగుతుందన్నారు.

ఓబీసీ డిక్లరేషన్‌, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌, ముస్లిం అండ్‌ మైనార్టీ, మహిళల డిక్లరేషన్‌పై పీఏసీలో చర్చ జరిగిందన్నారు షబ్బీర్‌ అలీ. దాంతోపాటు బస్సుయాత్ర రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించామన్నారు. మరోవైపు టీ కాంగ్రెస్‌లో ఎన్నికల కమిటీ జాబితా అగ్గి రాజేసింది. ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంతో పార్టీ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన అనుచురులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకొని నిరసన తెలిపారు. పొన్నం ప్రభాకర్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు